SP Balu In Serious Condition : ఐసీయూలో ఎస్పీ బాలు

SP Balu In Serious Condition : ఐసీయూలో ఎస్పీ బాలు
x
SP Balu (File Photo)
Highlights

SP Balu In Serious Condition : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి..

SP Balu In Serious Condition : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీపైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రాజమౌళితో పాటుగా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఇందులో కొందరు కోలుకోగా మరికొందరు కరోనాతో పోరాడుతున్నారు.

రీసెంట్‌గా లెజెండరీ సింగర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నిజానికి బాలుకు ఆసుపత్రిలో చికిత్స అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ చాలని వైద్యులు చెప్పినప్పటికీ అయన వైద్యుల సమక్షంలోనే ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు.. ప్రస్తుతం అయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

అప్పటినుంచి అయనకి అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయన అస్వస్థతకు గురైనట్టుగా వైద్యులు వెల్లడించారు.. గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, నిపుణుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక అయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories