SP Balasubramanyam : దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ సారి శబరిమలను సందర్శించిన సందర్భంగా పంబా నుంచి ఆలయం వరకు డోలీలో ప్రయాణించారు.
SP Balasubramanyam : దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ సారి శబరిమలను సందర్శించిన సందర్భంగా పంబా నుంచి ఆలయం వరకు డోలీలో ప్రయాణించారు. ఈ ప్రయాణానికి ముందు తన డోలీని మోసే వ్యక్తుల పాదాలకు బాలసుబ్రహ్మణ్యం నమస్కరించారు. అంతేకాకుండా తనతోపాటు వచ్చిన ఓ స్నేహితుడికి కూడా డోలీవాలాలకు నమస్కారం చేయమని చెప్పారు. ఇది బాలు వ్యక్తిత్వానికి నిదర్శనం అని వీడియోను చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.
ఎస్పీ బాలు ఓ మంచి గాయకుడూ గానే కాకుండా ఓ మంచి మనసున్న మనిషిగా కూడా పేరు సంపాదించుకున్నారు.. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తూ చాలా మర్యాదగా మాట్లాడుతుంటారు బాలు.. అయితే గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయన ఇక లేరు అన్న వార్తను ఆయన అభిమానులు సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయనతో ఉన్న జ్ఞానపకాలను నెమరువేసుకుంటున్నారు. అందులో భాగంగానే అయన శబరిమల వెళ్ళినప్పుడు అయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.-
This video has visuals of Legendary singer #SPBalasubramanyam garu touching the feet of persons who carry him from Pambai point to Lord Ayyappan temple in Sabari malai such is his humbleness and greatness long live S.P.B name and fame #RIPSPB pic.twitter.com/wZYADiKcJI
— BARaju (@baraju_SuperHit) September 25, 2020
బాలు అంత్యక్రియలు :
బాలు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా అభిమానులు ఎవరు రావొద్దని కుటుంబసభ్యులు కోరుతున్నారు... ప్రభుత్వ లాంఛనాలతో బాలు సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు రెడ్ హిల్స్‌లో ఫామ్ హౌస్‌లో ఉంచారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire