Karthika Deepam : మా నాన్నా..మీ నాన్న ఒక్కరే! బాంబు పేల్చిన సౌర్య!!

Karthika Deepam : మా నాన్నా..మీ నాన్న ఒక్కరే! బాంబు పేల్చిన సౌర్య!!
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 756 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తి కరంగా మారింది.

వంటలక్క అదృశ్యం అయింది..కార్తీక్ వెదికి పట్టుకొచ్చాడు.. ఈ క్రమంలో సౌర్య కార్తీక్ ను నాన్న అని పిలిచింది.. సౌర్యకు దీప నిజం చెప్పిందని కార్తీక్ ఆమెను తిట్టిపోశాడు.. దీప తన ఇంటికి చేరుకుంది. హమ్మయ్య కథ చాలావరకూ సుఖాంతం అయింది. కానీ, అసలు ప్రశ్న మిగిలే ఉంది. అసలు వంటలక్క అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం దీప అత్తా సౌందర్య.. దీప కూతురు సౌర్య ప్రయత్నించారు. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య దీపను ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నించింది కాస్త గట్టిగానే అడిగింది. అయినా దీప మౌనంగా కాఫీ కప్పు తిప్పుతూ ఉండిపోయింది. దీంతో సౌందర్యకు అర్థం అయిపొయింది ఇక దీప ఆ విష్యం గురించి ఏమీచెప్పదు అని. అందుకే.. దీప లేని సమయంలో కార్తీక్ దీప కోసం ఎంత ఆందోళన చెందాడో చెప్పడానికి ప్రయత్నించింది.

అసలు నీకెందుకే ఇంత నిరాశ అంటూ ప్రారంభించి.. దీప కనబడటం లేదనే విషయం తెలిసిన దగ్గరనుంచీ కార్తీక్ వెతుకులాట.. ఆక్రమంలో సౌర్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం.. ఒక మహిళ మరణించింది అని తెలిస్తే అది దీప ఏమో అని సౌర్య కార్తీక్ ను అడగడటం.. కార్తీక్ ను సౌర్య నాన్నా అని పిలవడం అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. కార్తీక్ కచ్చితంగా నీ మీద ప్రేమగానే ఉన్నాడని చెప్పింది. సౌందర్య చెప్పిన మాటలకు దీప నవ్వుతుంది. ఎందుకె నవ్వుతున్నావు అంటే.. అసలు మీ సుపుత్రుడి గురించి మీరు వచ్చి నాకు చెబుతుంటే నవ్వొస్తోంది అత్తయ్యా అంటుంది. నాకు ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డకు నాన్న లేదు.. మరో బిడ్డకు తల్లి లేదు ఇంత దురవస్థ అనుభవిస్తున్న నాకు మీ కొడుకు గురించి గొప్పలు చెబుతారా. మీ వంశోద్ధారకుడు చాలా మంచి వాడే.. ఆయనకు అన్నీ మంచి లక్షణాలే వున్నాయి. కానీ నా మీద నమ్మకమే లేదు. తన భారీ మీద ప్రేమే లేదు. తన కూతురికి ఎప్పుడో తను ప్రేమించి చనిపోయిన ఆమె ఫోటో గోడకు తగిలించి తానే మీ అమ్మ అని చెప్పారు. తన గుండె గోడకు మేకు కొట్టి నా ఫోటో పెట్టుకుని దానికి దండ కూడా వేసేశారు. ఇంకా ఎందుకు అత్తయ్యా మీ కొడుకు గురించి నాదగ్గర చందమామ కథలు చెబుతారు అంటూ నిలదీసింది. ఆమె వరుసగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సౌందర్య చివరికి కార్తీక్ కు నీ మీద అనుమానం ఉండొచ్చు... కానీ ప్రేమ కూడా ఉంది ఎప్పటికైనా ఆ ప్రేమే మిమ్మల్ని ఇద్దర్నీ దగ్గర చేస్తుంది. ఆ నమ్మకం నాకిప్పుడు కలిగింది అని గట్టిగా చెబుతుంది. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళవు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేవు కానీ కచ్చితంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. తర్వాతైనా సరే అని సౌందర్య గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది.

దుఖానికి కేరాఫ్ ఎడ్రస్..

ఇక దీప తండ్రి దిగాలుగా కూర్చుని ఉంటాడు. అక్కడకు వచ్చిన అతని భార్య భాగ్యం గట్టిగా అతన్ని నిలదీస్తుంది. నువ్వు నీ కూతురు కోసం ఏమి చేశావు చెప్పు. నేనంటే సవతి తల్లిని.. దాని మంచీ కోరుకోలేదు..చెడూ కోరుకోలేదు.. నువ్వు కన్నా తండ్రివి కదా నువ్వేమి చేశావు. కూతురు అంత కష్టం లో ఉంటె కనీస అల్లుడి దగ్గరకు వెళ్లి కాళ్ళు పట్టుకుని దీప కష్టం చూడమని చెప్పగాలిగావా? ఊరికే పెళ్ళాం మీద ఎగరడం.. దేవుని మీద ఎగరడం తప్ప నీకూతురికి ఎం చేశావు. దుఖానికి జెరాక్స్ కాపీల మొహం పెట్టుకుని తిరగడం తప్ప నువ్వు నీ కూతురికి ఏమి చేశావు అంటూ గడ్డి పెడుతుంది.

సౌర్య పేల్చిన బాంబు!

ఇక స్కూలుకు మామూలుగానే వంటలక్క వారణాసి ఆటోలో సౌర్యను తీసుకుని వస్తుంది. మరోవైపు సౌందర్య కారులో హిమను తీసుకు వస్తుంది. హిమ వంటలక్క అంటూ పరిగెత్తి వారి దగ్గరకు వెళుతుంది. సౌర్య ను పలకరిస్తుంది. అయితే, సౌర్య ముభావంగా నిలబడుతుంది. దీంతో సౌర్యను హిమ ఏమైంది సౌర్య అని అడుగుతుంది. దానికి సౌర్య మనసులో అమ్మ ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదు. కానీ, తిరిగి వచ్చిన దగ్గరనుంచీ అదోలా ఉంటోంది. డాక్టర్ బాబు మా నాన్న అనే విషయం నాకు తెల్సిపోయింది. హిమకు తెలీదు. ఈ విషయం హిమకు చెప్పేయాలి. అని నిర్ణయం తీసుకుంటుంది. హిమా నీకో విషయం చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాను అంటుంది. దీంతో దీప, సౌందర్య కంగారు పడతారు. సౌర్యను వారించడానికి సిద్ధం అవుతారు. కానీ, హిమ సౌర్యను పక్కకు తీస్కువేల్లిపోతుంది. ఏమిటి విషయం సౌర్యా అని అడుగుతుంది. మన దగ్గర వీళ్ళంతా ఓ విషయం దాచి పెట్టారు. నేను స్వయంగా ఈ విషయం కనిపెట్టాను అని చెబుతుంది సౌర్య. ఏమిటి అది అని హిమ అడుగుతుంది. మీనాన్నే మా నాన్న అని నిజం చెప్పేస్తుంది. అంతే అది బాంబులా పేలింది.

ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జరిగే సంఘటనలు ఇవే. మరి సౌర్య పెచిన బాంబు ఎఫెక్ట్ ఎంతవరకూ వెళ్ళింది. వంటలక్క, సౌందర్య పరిస్థితి ఏమిటి? అనేవి తరువాతి ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఈరోజు 14 మర్చిన ప్రసారం కానున్న ఎపిసోడ్ లో సౌర్య పేల్చినా బాంబు హైలైట్. ఈ వివరాలు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే మా టీవీలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం చూసి తీరాల్సిందే!

గతంలో జరిగిన కథ ఇదీ..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

ఇంటిల్లపాది మనసునూ దోచుకున్న కార్తీక దీపం సీరియల్ ప్రతిరోజూ స్టార్ మా టీవీలో వస్తోంది. అదేవిధంగా హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎపిసోడ్ లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మానవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం సీరియల్ మీరూ మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories