Sonu Sood tops IIHB Survey: కుమార్ అక్ష‌య్, అమితాబ్ ల‌ను క్రాస్ చేసిన సోనూసూద్!

Sonu Sood tops IIHB Survey: కుమార్ అక్ష‌య్, అమితాబ్ ల‌ను క్రాస్ చేసిన సోనూసూద్!
x
Highlights

Sonu Sood tops IIHB Survey: కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా మూడు నెలల నుంచి లాక్ డౌన్ ల మీదా లాక్ డౌన్ లు విధిస్తూ ముందుకు వెళ్లడంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది..

Sonu Sood tops IIHB Survey: కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా మూడు నెలల నుంచి లాక్ డౌన్ ల మీదా లాక్ డౌన్ లు విధిస్తూ ముందుకు వెళ్లడంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది.. వారు ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేకా చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో వారి బ్రతుకులు రోడ్డుమీద పడ్డాయి. దీంతో చేసేది ఏమీ లేక సొంత గ్రామాలకు కాలినడకన బయలుదేరాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.. దీనితో అలాంటి వారిని ఆదుకోవడం కోసం చాలా ముందుకు వచ్చి తమ గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ విలన్ సోనూసూద్ ఒకరు.

సొంత గూటికి చేరలేక బిక్కుబిక్కుమంటున్న వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు వ‌ల‌స కార్మికుల‌ కోసం బ‌స్సులు ఏర్పాటు చేశాడు సోనూసూద్ ..దీనితో ఎక్కడ చూసినా సోనూసూద్ పేరు మారుమ్రోగింది..సినీ ఫీల్డ్ లో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బి) లాక్‌డౌన్ స‌మ‌యంలో సేవ‌లు చేసిన ప్రముఖుల పనితీరుపై ఒక సర్వే నిర్వహించగా అందులో సోనూసూద్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో అక్షయ్ కుమార్ , అమితాబ్ బచ్చన్ ఉన్నారు.

సోనూసూద్ పై విమర్శలు..

ఇంతమంది వలసకూలీలను ఆదుకున్న సోనూసూద్ పైన కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు.

రాజకీయ లబ్దికోసమే సోనూసూద్ ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత నగ్మా సోనూసూద్ ని విమర్శించారు.. అయితే మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి విమర్శలు కామన్ అంటూ సోనూసూద్ వాటిని కొట్టిపారేశారు..

టాలీవుడ్ లో టాప్ విలన్!

ఇక టాలీవుడ్ లో సోనూసూద్ టాప్ విలన్ లలో ఒకరు.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ఆ తర్వాత ఆంజనేయులు, దూకుడు, ఆగడు, అరుంధతి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories