Sonu Sood about Warrior Aaji Maa: కరోనా లాక్ డౌన్ సమయం నుండి వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట నటుడు సోను సూద్ దేవుడుగా నిలిచాడు.
Sonu Sood about Warrior Aaji Maa: కరోనా లాక్ డౌన్ సమయం నుండి వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట నటుడు సోను సూద్ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. కార్మికులు కాలి నడకన వెళ్లకుండా వారికి భోజనం ఏర్పాటు చేసి, వారికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ ఇంటికి చేర్చాడు. దీనితో ఎక్కడ చూసినా సోనూసూద్ పేరు మారుమ్రోగింది. అయితే ఇలా సేవలకి సోనూసూద్ ఎక్కడ కూడా బ్రేక్ వేయడం లేదు.. కష్టం ఎక్కడుంటే అక్కడ సోనూసూద్ ఉంటున్నాడు.
తాజాగా ఓ పుణెకు చెందిన ఆజీమా అనే 85 ఏళ్ల వృద్ధురాలకి కరోనా సమయంలో కుటుంబ పోషణ భారమైంది. ఆకలి కోసం ఇంకా ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉండాలని అనుకుందో ఏమో కానీ ఆకలి కోసం తనకు తెలిసిన కర్రసామును సాధన చేస్తూ 'చేతనైన సాయం చేయండి' అంటూ రోడ్డు పైన అర్థించడం మొదలు పెట్టింది. 85 ఏళ్ల వయసులోనూ ఆ వృద్దురాలు అలా కర్రసాము చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపైన నటుడు సోనూసూద్ స్పందించాడు.
" ఈ వృద్ధురాలి వివరాలు నాకు తెలియజేయండి. ఆమెతో ఒక శిక్షణా పాఠశాలను ప్రారంభిస్తా. దేశంలోని మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తా' అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా మరో హీరో రితేశ్ దేశ్‌ముఖ్ కూడా స్పందిస్తూ ఆమె వివరాలను కోరాడు.
Can I get her details please. Wanna open a small training school with her where she can train women of our country some self defence techniques . https://t.co/Z8IJp1XaEV
— sonu sood (@SonuSood) July 24, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire