నన్ను విమర్శించే వారికి ఇదే నా సమాధానం : సోనూసూద్

నన్ను విమర్శించే వారికి ఇదే నా సమాధానం : సోనూసూద్
x

Sonu Sood

Highlights

Sonu Sood on Trolls : సోనూసూద్.. సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు చలించిపోతున్నాడు.

Sonu Sood on Trolls : సోనూసూద్.. సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు చలించిపోతున్నాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఓ సొల్యుషన్ లాగా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది వలసకూలీలను వారి వారి స్వస్థలానికి చేర్చి వారి పాలిట దేవుడిగా నిలించాడు.. అంతటితో ఆగకుండా ఇంకా తనకి తోచిన సహాయం చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పు బడుతూ ట్రోలర్స్‌ టార్గెట్‌ చేస్తున్నారు. దీనిపైన తాజాగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ సూద్‌ స్పందించాడు..

" నేను సాయం చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారికి సంబంధించిన చిరునామాలు, ఫోన్‌ నంబర్లు నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల నుంచి తీసుకువచ్చిన విద్యార్థుల వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి.. కానీ నేను స్పష్టం చేయాలనుకోవట్లేదు.. నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలని కోరుతున్నాను " అని సోనూసూద్ వెల్లడించాడు. ఇక ఎవరు ఎన్ని విమర్శలు చేసిన అవి నన్ను ప్రభావితం చేయవు అని , నేను చేయాలనుకున్నది చేస్తాను అంటూ వెల్లడించాడు సోనూసూద్.. ఇక తానూ పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశాడు సోనూసూద్..

ఇక సోనుసూద్ ఇటివల పేద విద్యార్దుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ని రూపొందించిన సంగతి తెలిసిందే.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన విద్యార్దులకి స్కాలర్ షిప్ లు ఇస్తామని సోనుసూద్ ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షలు లోపు ఉన్న కుటుంబాలకి చెందిన, మెరుగైన ఉత్తిర్ణత సాధించిన విద్యార్దులు [email protected] మెయిల్ కి పది రోజుల లోగు వివరాలు పంపాలని సోనూసూద్ వెల్లడించాడు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories