పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా సోనుసూద్‌

పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా సోనుసూద్‌
x
Highlights

రీల్ లైఫ్ విలన్, రీయల్ లైఫ్ హీరో నటుడు సోనుసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

రీల్ లైఫ్ విలన్, రీయల్ లైఫ్ హీరో నటుడు సోనుసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ ఎన్నికల అధికారి ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదన మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సోనూసూద్ పంజాబ్ రాష్ట్రంలోని మెగా జిల్లాకు చెందినవాడు. నటుడిగా పలు భాషల్లో నటించి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైనగుర్తింపు తెచ్చుకున్నాడు సోనుసూద్‌.. ఇక కరోనా వైరస్‌ వలన ఏర్పడిన లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్ పేరు మారుమ్రోగిపోయింది.

లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్ లు మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు.. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకి గాను ఇటివల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories