సోన్ సూద్.. మారిన ఇమేజ్ తో మారతున్న పాత్రలు !

సోన్ సూద్.. మారిన ఇమేజ్ తో మారతున్న పాత్రలు !
x
Highlights

మనం సినిమాను తెర మీద చూస్తున్నప్పుడు నటుల క్యారెక్టర్లను బట్టి హీరో, విలన్, కమేడియన్ అని అంటాం. అదే బయట ఒక వ్యక్తిని హీరో అనాలంటే అంత...

మనం సినిమాను తెర మీద చూస్తున్నప్పుడు నటుల క్యారెక్టర్లను బట్టి హీరో, విలన్, కమేడియన్ అని అంటాం. అదే బయట ఒక వ్యక్తిని హీరో అనాలంటే అంత తొందరగా సంభోదించలేం. ఆ వ్యక్తిలో అలాంటి సుగుణాలు కనిపించినప్పుడే హీరో అని ఒప్పుకుంటాం. పొగుడుతాం. నిజ జీవితంలో కరెక్టుగా మనం హీరో అని పిలుచుకోడానికి చెప్పుకోడానికి ఆదర్శంగా దొరికిన వ్యక్తి సోనూసూద్. ఇప్పుడు అతని కోసం సినిమాల్లో కథలనే మార్చేస్తున్నారు. అదేంటో చూద్దాం.

అమ్మో సోనూసూద్. ఆ పేరు వింటేనే భయపడిపోతారు. అది ఒకప్పుడు. దేశవ్యాప్తంగా ఇప్పుడతను హీరో. రియల్ హీరో. అవును లాక్ డౌన్ సమయంలో సోనూ చేసిన సమాజ సేవ మరిచిపోలేనిది. అతను చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే అవుతుంది. దేశ విదేశాలలో అతనికి ఫ్యాన్ ఫాలోవింగ్ బాగా పెరిగింది. ఇప్పుడు అతని కోసం సినిమాల్లో విలన్ పాత్రలు కాకుండా మంచి ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లను సృష్టిస్తున్నారు. అలాగే సోనూని హీరోగా పెట్టి సినిమాలు తీయాలని దర్శకనిర్మాతలు వెంట పడుతున్నారు.

వెండి తెరపై సోనూసూద్ విలన్. హీరోతో దెబ్బలు తింటున్నప్పుడు ఇంకా కొట్టు, ఇంకా కొట్టని ఈలలు వేస్తారు. అరుంధతి సినిమాలో ఐతే అనుష్క సోనూసూద్ ని చంపేటప్పుడు మన కళ్లల్లో పట్టలేనంత ఆనందంతో పాటు ఆత్మ సంతృప్తి చెందుతాం. ఇది నిన్నటి మాట. ఇప్పుడు సినీ ప్రేక్షకుడు సోనూసూద్ ను అలా చూడడం లేదు. అని వక్కానిస్తున్నారు. ఇక మీదట సోనూ ను విలన్ గా చూపించొద్దని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సోనూ చేసే సమాజ సేవలకు ఫిదా అయ్యి తమ సొంత మనిషిగా భావిస్తున్నారు.

ఇప్పడు సోను సూద్ అందరి వాడు. సినీ దర్శకనిర్మాతలు కూడ సోను కోసం తమ కథలను మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు తమ కథల్లో మెయిన్ విలన్ గా వున్న సోనూని హీరోగా చేసేసారు. అంతే కాదు ఇప్పటికే సోను ఒప్పుకున్న సినిమాల్లో విలన్ కు బదులు ఆయన చేత ఓ మంచి ఇమేజ్ ఉన్న పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో వస్తున్న అల్లుడు అదుర్స్ సినమాలో సోనూకి సంబందించిన చాలా సీన్స్ మార్చటమే కాకుండా, త్వరలోనే రిలీజ్ చెయ్యబోయ్యే టీజర్, ట్రైలర్ లో సోనూసూద్ క్లిప్స్ కనిపించేల ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories