Somy Ali: లారెన్స్ బిష్ణోయ్‌ గురించి సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు

Somy Ali: లారెన్స్ బిష్ణోయ్‌ గురించి సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు
x
Highlights

Somy Ali comments on Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని బేవకూఫ్ (ఇడియట్) అంటూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబా...

Somy Ali comments on Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని బేవకూఫ్ (ఇడియట్) అంటూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబా సిద్ధిఖి హత్య తరువాత సల్మాన్ ఖాన్‌కి బెదిరింపుల వస్తోన్న నేపథ్యంలో గత వారం లారెన్స్ బిష్ణోయ్‌ని ఉద్దేశిస్తూ సోమి అలీ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో లారెన్స్ బిష్ణోయ్‌ని నమస్తే లారెన్స్ భాయ్ అని సోమి అలీ సంభోదించిన తీరు చూసి జనం షాకయ్యారు. సల్మాన్ ఖాన్ గురించి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి.. నాతో జూమ్ కాల్‌లోకి వస్తావా అని సోమి అలీ కోరడం నెటిజెన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది. కొంపదీసి సల్మాన్ ఖాన్‌కి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా లీక్ చేస్తుందా ఏంటని నెటిజెన్స్ చర్చించుకోవడం కనిపించింది. కానీ తాజాగా లారెన్స్ బిష్ణోయ్‌ని ఉద్దేశించి సోమి అలీ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆమె గత పోస్టుకు రివర్స్‌గా ఉన్నాయి.

తాజాగా ఓ హిందీ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సోమి అలీ, అందులో లారెన్స్ బిష్ణోయ్‌ని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడాడు అనే కోపంతోనే లారెన్స్ బిష్ణోయ్ పగ పెంచుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. హమ్ సాత్ సాత్ హై మూవీ షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా కేసు కూడా నమోదైంది. అయితే, తాజాగా సోమి అలీ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ పాత వివాదాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయ్ సామాజిక వర్గం వాళ్లు కృష్ణ జింకలను పూజిస్తారనే విషయం సల్మాన్ ఖాన్‌కి నిజంగా తెలియదని సోమి అలీ స్పష్టంచేసింది. అందుకు సల్మాన్ ఖాన్ తరపున తాను క్షమాపణలు చెబుతానని చెప్పారామె.

ఈ క్రమంలోనే లారెన్స్ గురించి మాట్లాడుతూ అతడొక బేవకూఫ్ అని అన్నారామె. అవసరమైతే తాను బిష్ణోయ్ సామాజిక వర్గం పెద్ద దేవేంద్ర బిష్ణోయ్‌తో మాట్లాడతానని అన్నారు. నవంబర్ నెలలో వెకేషన్ కోసం తాను ఇండియా వస్తున్నానని, అప్పుడే తాను దేవేంద్రను కలిసి మాట్లాడుతానని అన్నారు. ఇదంతా తాను పబ్లిసిటీ కోసం చేయడం లేదన్నారు. అందరూ బాగుండాలి. ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగొద్దు. ఒకరినొకరు అస్సలే చంపుకోవద్దు. అందుకే తాను ఈ చొరవ తీసుకోవడానికి ముందుకొస్తున్నానని సోమి అలీ ఆ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.

ఘటన జరిగిన స్థలం అంతా ఒక 80 ఎకరాలు ఉంటుంది. అక్కడికి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. అలాంటప్పుడు ఒక్క సల్మాన్ ఖాన్‌నే టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అది కూడా అతడు తెలియక చేసిన పొరపాటు అని అన్నారు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ మంచి మనిషి అని అభిప్రాయపడ్డారు. గతంలో తాను సల్మాన్ ఖాన్‌తో కలిసి ఎన్నోసార్లు హంటింగ్ ట్రిప్స్‌కి (వేట) వెళ్లానని గుర్తుచేసుకున్నారు. సోమి అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories