సిరివెన్నెల రాసిన పాట‌ల‌న్నీ ఆణిముత్యాలే.. ఆయనకు వచ్చిన అవార్డుల వివరాలివి..!

Sirivennela Sitarama Sastry Awards List
x

సిరివెన్నెల రాసిన పాట‌ల‌న్నీ ఆణిముత్యాలే.. ఆయనకు వచ్చిన అవార్డుల వివరాలివి..!

Highlights

Sirivennela Sitarama Sastry: టాలీవుడ్‌కు ఊహించని కోలుకోలేని షాక్ తగిలింది.

Sirivennela Sitarama Sastry: మాటల పూదోట మూగబోయింది.! విలువల సాహిత్యం దివికెగసింది.! నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూనే శ్రోతలకు కన్నీళ్లను మిగిల్చి పాటల వెన్నెల దివికేగింది.! తెలుగు సినీ సాహిత్య ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అందించిన ఆ కలం కన్నీటి పర్యంతం అవుతోంది.! జగమంత కుటుంబాన్ని ఏకాకిని చేస్తూ సిరివెన్నెల సీతారామశాస్త్రి శివైక్యమయ్యారు.

విధాత తలపున అంటూ సిరివెన్నెలతో తన పేరునే మార్చుకున్న సీతారామశాస్త్రి లలిత ప్రియ కమలం అంటూ శ్రోతల మృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆకాశంలో ఆశల హరివిల్లు అంటూ తెలుగింటి ఆడపడుచులను ఆనందంలో ముంచెత్తారు. శృతి లయలు, క్షణక్షణం, గాయం ఇలా ఎన్నో చిత్రాలకు తన అద్భుత సాహిత్యంతో శ్రోతలను మెప్పించారు. సింధూరంలో అర్థశతాబ్ధపు అజ్ఞానాన్నే అంటూ సిరివెన్నెల రాసిన సాహిత్యం మరో వందేళ్లయినా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇక సిరివెన్నెల అలవైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాట ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సీతారామశాస్త్రి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో, అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట 'విధాత తలపున'కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రిది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు. 'కంచె' చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు.

సిరివెన్నెల ఉత్తమ రచయితగా సాధించిన అవార్డులు..

నంది అవార్డులు.. పాట

1. సిరివెన్నెల (1986) – విధాత తలపున

2. శృతిలయలు (1987) – తెలవారదేమో స్వామి

3. స్వర్ణకమలం (1988) – అందెలరావమిది పదములదా

4. గాయం (1993) – సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని

5. శుభ లగ్నం (1994) – చిలక ఏ తోడు లేక

6. శ్రీకారం (1996) – మనసు కాస్త కలత పడితే

7. సింధూరం (1997) – అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే

8. ప్రేమ కథ (1999) – దేవుడు కరుణిస్తాడని

9. చక్రం (2005) – జగమంత కుటుంబం నాది

10. గమ్యం (2008) – ఎంత వరకు ఎందుకు కోరకు

11. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) - మరి అంతగా

ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు)..

1. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)

2. గమ్యం (2008)

3. మహాత్మ (2009)

4. కంచె (2015)

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్

ఉత్తమ గేయ రచయిత (తెలుగు) – కంచె (2015)

Show Full Article
Print Article
Next Story
More Stories