ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం

ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
x
Highlights

టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా చెంబోలు వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. వధువు వెంకటలక్ష్మి హిమబిందుతో రాజా వివాహం జరిహింది.

టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా చెంబోలు వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. వధువు వెంకటలక్ష్మి హిమబిందుతో రాజా వివాహం జరిహింది. ఇక హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన వేడుకకు టాలీవుడ్ నుంచి దర్శకులు త్రివిక‍్రమ్‌, కృష్ణవంశీ, నిర్మాతలు అల్లు అరవింద్‌, వెంకట్‌ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్‌ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అటు అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజా చెంబోలు కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అయితే అయన తండ్రి లాగా పాటల రచయితగా కాకుండా నటన వైపు వెళ్లారు రాజా.. అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఫిదా , రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ' వంటి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇందులో ఫిదా సినిమా రాజాకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇప్పడు వెబ్ సిరీస్‌లలోనూ కూడా నటిస్తున్నాడు రాజా.. ఆయ‌న చివ‌రిసారిగా భానుమ‌తి రామ‌కృష్ణ మూవీలో న‌టించారు. ఇక ఇది ఇలా ఉండే తాజాగా రాజా చెంబోలు త‌న నిశ్చితార్థం ఆగస్టులో జరగగా, దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు రాజా..

Show Full Article
Print Article
Next Story
More Stories