Sirivennela On SPB : అన్నయ్య త్వరగా కోలుకుంటారు.. సిరివెన్నల ఎమోషనల్ పోస్ట్!

Sirivennela On SPB : అన్నయ్య త్వరగా కోలుకుంటారు.. సిరివెన్నల ఎమోషనల్ పోస్ట్!
x
sirivennela seetharama sastry, sp balasubrahmanyam (File Photo)
Highlights

Sirivennela On SPB : ప్రముఖ‌ గాయకుడు ఎస్పీ బాల‌సుబ్రమ‌ణ్యం కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో

Sirivennela On SPB : ప్రముఖ‌ గాయకుడు ఎస్పీ బాల‌సుబ్రమ‌ణ్యం కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్న క‌థ‌నాలు రావ‌డంతో సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. బాలు త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ దేవుడిని ప్రార్థించారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం 6 గంటలకు 'యూనివర్సల్ మాస్ ప్రేయర్‌'లో పాల్గొనాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ పిలుపునిచ్చారు. దీనితో సినీ గాయకులు, గేయ రచయితలు, బాలు అభిమానులు ఈ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు.

అయితే ఈ సామూహిక ప్రార్థనలో పాల్గొన్న గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని కోరారు.. అంతేకాకుండా ఆయనే స్వయంగా ఓ కవితను చదువుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''నిన్ను చీమైనా కుట్టదు.. ఆ శివుడి మీద ఆన" అంటూ భాగోద్వేగ కవితను వినిపించారు సిరివెన్నెల.. ఈ కవిత ప్రతి ఒక్కరి గుండెను పిండేసిందని చెప్పాలి.

ఇక తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని వెంటిలేటర్‌పై నుంచి తీశారని వస్తోన్న వార్తలు అవాస్తవమని ఎస్పీ చరణ్ తెలిపాడు. అలాంటి ఓ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. మా నాన్న గారి పరిస్థితి నిన్నటిలానే ఉంది. దయచేసి రూమర్లను రాయకండని విన్నవించుకున్నాడు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. అని ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories