SP Balasubrahmanyam : గుడ్ న్యూస్ : ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్!

SP Balasubrahmanyam : గుడ్ న్యూస్ : ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్!
x

SP Balasubrahmanyam

Highlights

SP Balasubrahmanyam : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది.

SP Balasubrahmanyam : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ అయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. " ఈ వారంతరంలో నాన్న గారి ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇవ్వనందుకు క్షమించండి.. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంది. వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుంది. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకి నెగిటివ్ వచ్చింది.. ప్రస్తుతం ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారు" అని చరణ్ వెల్లడించాడు. ఇక తన తండ్రి ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలిపారు చరణ్..

ఎస్పీ బాలు త‌న 51వ వివాహ వార్షికోత్సవాన్ని ఆసుప‌త్రిలోనే శ్రీమ‌తితో క‌లిసి చేసుకున్నట్టుగా తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. దంప‌తులు ఇద్దరు కేక్ కూడా క‌ట్ చేసిన‌ట్టుగా ఆ వార్తల్లో వెల్లడించాయి.. డాక్టర్లు, ఐసీయూ సిబ్బంది న‌డుమ ఈ వేడుక జ‌రుపుకున్నట్టుగా సమాచారం.. అటు ఆగస్టు మొదటివారంలో ఎస్పీ బాలు కరోనా బారిన పడ్డారు. దీనితో అయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు. ఆయన త్వరగా తిరిగి రావాలని సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా అభిమానులు కోరుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories