Nirosha: 'సింధూర పువ్వు' నిరోశ ఇప్పుడెలా ఉందో తెలుసా? చెక్కు చెదరని అందం..!

Sindhura Puvvu Fame Actress Nirosha Latest Photos Goes Viral in Social Media
x

Nirosha: 'సింధూర పువ్వు' నిరోశ ఇప్పుడెలా ఉందో తెలుసా? చెక్కు చెదరని అందం..!

Highlights

Senthoora Poove: సింధూర పువ్వు.. ఈ తరం యువతకు పెద్దగా ఈ సినిమా గురించి తెలియకపోయినా 90వ దశకంలో ఈ సినిమా ఓ సంచలనం

Senthoora Poove: సింధూర పువ్వు.. ఈ తరం యువతకు పెద్దగా ఈ సినిమా గురించి తెలియకపోయినా 90వ దశకంలో ఈ సినిమా ఓ సంచలనం ముఖ్యంగా ఈ సినిమాలోని సింధూరా పువ్వా.. తేనే చిందించరావా.. పాటకు ఎంతో మంది ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ పాట వస్తుందంటే అలాగే వింటుంటారు. ఈ తరం యువత కూడా ఈ పాటను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిరోషా ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. అప్పట్లో కుర్రకాళ్లు కలల రాణిగా ఓ వెలుగు వెలిగింది. ఇదిలా ఉంటే నిరోషా స్టార్‌ హీరోయిన్‌ రాధిక చెల్లెలు అనే విషయం చాలా మందికి తెలిసిందే. రాధిక స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే నిరోషా వెండి తెరకు పరిచయమైంది. అగ్ని నక్షత్రం అనే తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఇక తెలుగులో ఘర్షణ మూవీతో ప్రేక్షకులకు పలకరించింది.

దీంతో నిరోశకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఒకే ఏడాదిలో ఏకంగా 5 సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కాగా ముద్దుల మామయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాలల్లో నటించి తెలుగులోనూ మంచి విజయాలను నమోదు చేసుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో సింధూర పువ్వులో నటించిన హీరో రాంకీనీ ప్రేమ వివాహం చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నిరోశ ఇప్పుడు మళ్లీ వెండి తెరపై అడపాదడపా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అసాధ్యుడు, ఒక ఊరిలో లాంటి సినిమాల్లో కనిపించింది. ఈ చిత్రాల్లో నెగిటివ్‌ రోల్‌లో ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories