అప్పుడు రాజమౌళి 'ఛత్రపతి'.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ 'సలార్' సూపర్ కనెక్షన్!

Prabhas Chatrapathi vs Salaar movies
x
ఛత్రపతి సలార్ సినిమాల్లో ప్రభాస్ లుక్ 
Highlights

ప్రభాస్ రాజమౌళి తో చేసిన మ్యాజిక్ ప్రశాంత్ నీల్ తో రిపీట్ చేస్తారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయారు. ఇక ఈయన చేసే సినిమాలు ప్రతిదీ ప్రపంచవ్యాప్తంగా గా చాలా భాషల్లో విడుదలవుతుంది.ఈ యంగ్ రెబల్ స్టార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. సాహో తరువాత రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా మొదలెట్టేశారు. అయితే, ఈ సినిమాకి రాజమౌళి ఛత్రపతి సినిమాకి ఓ సారూప్యం ఆసక్తి కరంగా మారింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగానే వరుస సినిమాలను ప్రకటించి అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ మాత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంది. టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ రోజు ఈ చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి రాకింగ్ స్టార్ యాష్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ప్రశాంత్ మరియు ప్రభాస్ కాంబోలో వయోలెంట్ మాఫియా నేపథ్యంతో సలార్ తెరకెక్కుతుంది.

మిగతా సినిమాలతో పోలిస్తే సలార్ కే ఎందుకు ఇంతటి క్రేజ్ బజ్ ఏర్పడింది అంటే కారణం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి ఆర్ఆర్ తర్వాత అంతటి క్రేజ్, బజ్ సంపాదించుకుంది సాలార్ చిత్రమే అని చెప్పుకోవచ్చు.

భీభత్సమైన వయోలెన్స్ చూపించడంలో ప్రశాంత్ నిల్ కి ఆయనే సాటి. కే జి ఎఫ్ ఎఫ్ పార్ట్ 2 కి బజ్ ఉంది అంటే ఆ వైలెన్స్ ఏ మరో కారణం అని చెప్పుకోవచ్చు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఇది నాలుగో సినిమా. ఇలా కేవలం మూడు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మరో దర్శకుడికి గతంలో ప్రభాస్ అవకాశం ఇచ్చింది రాజమౌళికి , చత్రపతి సినిమా కోసం. అది ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరియర్ కి మంచి ప్లస్ అయింది. మరి ఇలా నాలుగో చిత్రానికె అవకాశం సంపాదించిన ప్రశాంత్ నీల్ కి కూడా సలార్ సినిమా ప్లస్ అవుతుందా? అంతేకాదు. ఛత్రపతి సినిమా కూడా పూర్తిగా మాస్ మసాలా యాక్షన్ సినిమా. అండర్ వరల్డ్ లాంటి కథే. అదేవిధంగా సలార్ కూడా అండర్ వరల్డ్ కథాంశంతో.. పూర్తి మాస్ మసాలా యాక్షన్ సినిమాగా వస్తున్నట్టు చెబుతున్నారు. అదీ కాకుండా రాజమౌళి టేకింగ్ కి ప్రశాంత్ నీల్ టేకింగ్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. యాక్షన్ మూవీలో సెంటిమెంట్ ను దత్తించడంలో ఇద్దరూ ఎవరికీ వారు అదర గొట్టేస్తారు. మరి ఇప్పుడు ప్రభాస్ రాజమౌళి తో కలిసి చేసిన మ్యాజిక్ మళ్ళీ ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories