ప్రియుడికి బ్రేక్ అప్ చెప్పిన శృతి హాసన్

ప్రియుడికి బ్రేక్ అప్ చెప్పిన శృతి హాసన్
x
Highlights

హాట్ బ్యూటీ శ్రుతి హాసన్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆఖరి సారిగా 'కాటమారాయుడు' సినిమాలో కనిపించిన ఈమె కొన్ని సంవత్సరాలుగా...

హాట్ బ్యూటీ శ్రుతి హాసన్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆఖరి సారిగా 'కాటమారాయుడు' సినిమాలో కనిపించిన ఈమె కొన్ని సంవత్సరాలుగా లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2016లో శ్రుతి ఓ కాన్సర్ట్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడు ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మైఖెల్‌ను కలిసింది. వారి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. శ్రుతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మైఖెల్‌ కనిపిస్తూనే ఉండేవాడు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు బ్రేకప్‌ చెప్పేసుకున్నారు అని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఈ విషయాన్ని మైఖెల్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోవడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. 'మా జీవితాలు మమ్మల్ని వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరిగా నడవాల్సి వస్తోంది. కానీ ఈమె ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ మంచి స్నేహితుడిగా ఉండిపోబోతున్నందుకు చాలా గొప్పగా ఉంది' అని శ్రుతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసాడు మైఖేల్. వారి మధ్య పెద్ద గొడవలు లేవని, పరస్పరం చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు అని సన్నిహిత వర్గాలు మీడియా చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories