Sreekaram: ఫస్టాఫ్ డీసెంట్..'శ్రీకారం' ట్విట్టర్ రివ్యూ

Sreekaram Movie Twiier Review
x

శ్రీకారం మూవీ ఇమేజ్ 

Highlights

Sreekaram: కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని ప్రేక్షకులను అంటున్నారు.

Sreekaram: యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో కిషోర్ బి దర్శకుడిగా పరిచయమవుతు రూపొందింన చిత్రం'శ్రీకారం'.ఆధునిక వ్యవసాయం, యువత వ్యవసాయంలోకి రావటం వంటి సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందించారు. మహాశివరాత్రి కానుకగా ఈరోజు (మార్చి 11న) 'శ్రీకారం' విడుదలైంది.

శర్వాకు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, వీకే నరేష్, ఆమ‌ని, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే 'శ్రీకారం' యూఎస్ ప్రీమియర్లు మొదలయ్యాయి. అక్కడ సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా ఓపినియన్ చెబుతున్నారు. శర్వా ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నందుకు అభినందించాల్సిందేనని అంటున్నారు. సినిమా చాలా బాగుందని, టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందని ఆడియోన్స్ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.

ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని.. ఇక సెకండాఫ్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని చెబుతున్నారు. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని ప్రేక్షకులను అంటున్నారు. ఎమోషన్ సీన్స్‌లో శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, మరికొందరు సీరియస్ టాపిక్‌పై కమర్షియల్ మరకలు పడ్డాయని విమర్శిస్తున్నారు. ''ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా'' అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ అందరికీ కనెక్ట్ ట్వీట్లు చేస్తున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories