Jersey Remake: హీరో మూతికి గాయాలు

Jersey Remake: హీరో మూతికి గాయాలు
x
Highlights

గత ఏడాది కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌.. ఈ సినిమా తర్వాత తెలుగులో హీరో

గత ఏడాది కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌.. ఈ సినిమా తర్వాత తెలుగులో హీరో నాని నటించిన 'జెర్సీ' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. సినిమా మొత్తం క్రికెట్ నేపధ్యలో సాగుతుంది. అయితే షాహిద్ క్రికెట్ ఆడుతున్న సన్నివేశాన్ని తెరకేక్కిస్తుండగా ఉహించని విధంగా బంతి షాహిద్ మూతికి తగిలడంతో షాహిద్ పెదవి చిట్లి రక్తం రావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. షాహిద్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, వారం రోజుల పాటు రెస్ట్ కావాలని వైద్యులు సూచించారట!

ఛండీగఢ్‌లోని మొహాలి స్టేడియంలో ఈ సన్నివేశాలను తెరకేక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ వెంటనే మొహాలికి బయలుదేరారు. తెలుగులో జెర్సీ సినిమాని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని కూడా తెరకేక్కిస్తున్నాడు. ఇందులో మృణాల ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ ఇందులో సత్యరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని ఆగస్ట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories