NTR: అదిరిపోయే అప్‌డేట్‌.. ఎన్టీఆర్‌ మూవీలో మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో?

NTR: అదిరిపోయే అప్‌డేట్‌.. ఎన్టీఆర్‌ మూవీలో మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో?
x
Highlights

Shah Rukh Khan in NTR War 2 Movie: ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ మూవీస్‌తో యంగ్ ‌ టైగర్ ఎన్టీఆర్ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు....

Shah Rukh Khan in NTR War 2 Movie: ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ మూవీస్‌తో యంగ్ ‌ టైగర్ ఎన్టీఆర్ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు చిత్రాల ద్వారా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్‌ పేరు మారుమోగింది. దీంతో తారక్‌ పాన్‌ ఇండియా హీరోగా మారారు.ఇటీవల వచ్చిన దేవర హిందీలోనూ మంచి కలెక్షన్లను రాబట్టడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా వార్‌2 చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాశ్‌ ఫిల్మ్స్‌ వార్‌ మూవీకి సీక్వెల్‌గా ఈ వార్‌-2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు, హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నారు. ఇక హీరోయిన్‌గా ఈ మూవీలో కియారా అద్వానీ నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి స్థాయిలో యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించనున్నారని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో కాకుండా కేవలం గెస్ట్‌ రోల్‌లోనే షారుఖ్‌ కనిపించనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇక వార్‌2 మూవీకి సంబంధించి ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సన్నివేశాల్లో 40 మందికి పైగా విలన్లతో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ ఉంటుందని తెలుస్తోంది. 2025 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే వార్‌ 2 సినిమా టైటిల్‌కు తెలుగులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వార్‌2 టైటిల్‌కు 'యుద్ధభూమి' అనే ట్యాగ్‌ను యాడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories