షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ రూ. 6,300 కోట్లు... ఫోర్బ్స్ టాప్-10 రిచ్ యాక్టర్ల జాబితాలో అల్లు అర్జున్, ప్రభాస్
అయితే ఇటీవల కాలంలో దక్షిణాదికి, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు టాలీవుడ్ రేంజిని తిరగరాశాయి.
షారుఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న యాక్టర్. ఆయన ఆస్తుల విలువ రూ.6300 కోట్లు. అంతేకాదు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోల జాబితాల్లో కూడా ఆయనే టాప్. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, ప్రభాస్, కమల్ హాసన్ తదితరులు దేశంలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోలుగా ఫోర్బ్స్ రిచెస్ట్ యాక్టర్స్ -2024 జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
బాలీవుడ్ కు షాకిచ్చిన టాలీవుడ్
దేశంలో హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నందున బాలీవుడ్ సినిమాదే పైచేయిగా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో దక్షిణాదికి, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు టాలీవుడ్ రేంజిని తిరగరాశాయి.
షారుఖ్ ఖాన్ సినిమాల వరుస విజయాలు
షారుఖ్ ఖాన్ ను కింగ్ ఖాన్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన నటించిన జవాన్, పఠాన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై 2 వేల కోట్ల రూపాయాలు వసూలు చేసింది. ఇటీవలనే విడుదలైన ఢంకీ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి టాక్ ఉంది. బాలీవుడ్ లో ఇప్పటికీ కూడా షారూక్ ఖాన్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది.
సల్మాన్ ఖాన్ సంపద 2,900 కోట్లు
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కండల వీరుడి సంపద విలువ 2,900 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. ఆయన నటించిన టైగర్-3 సినిమా విజయవంతంగా థియేటర్లలో నడుస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 466.63 కోట్లు వసూలు చేసింది.
అక్షయ్ కుమార్ ఆస్తుల విలువ 2,500 కోట్లు
అక్షయ్ కుమార్ హస్య చిత్రాలతో పాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాల్లో ఎక్కువగా నటించారు. 2023లో అక్షయ్ కుమార్ కు పెద్దగా హిట్స్ లేవు. కానీ, ఓఎంజీ 2లో ఆయన గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమా 221 కోట్లు వసూలు చేసింది.
ఆమిర్ ఖాన్ ఆస్తుల విలువ 1,862 కోట్లు
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ సంపద 1862 కోట్లు. పలు సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. లాల్ సింగ్ చద్దా ఆయనకు ఆశించిన విజయాన్ని అందించలేదు. కానీ, దంగల్, పీకే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.ఈ ఏడాదిలో సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
జోసెఫ్ విజయ్ సంపద 474 కోట్లు
దళపతి విజయ్ దక్షిణాదికి చెందిన మరో అగ్రనటులు. ఆయన రెండు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. 2023లో విజయ్ నటించిన వరిసు, లియో సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. వరిసు సినిమా 300 కోట్లు, లియో 612 కోట్లు వసూలు చేసింది. 2023లో తమిళ సినిమా పరిశ్రమలో అత్యధికంగా డబ్బులు వసూలు చేసిన సినిమాగా లియో రికార్డు సృష్టించింది.
రజనీకాంత్ సంపద 430 కోట్లు
తమిళ సూపర్ స్టార్ గా పేరొందిన రజనీకాంత్ ఆస్తుల విలువ 430 కోట్లు. తమిళంలో ఎక్కువ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయన నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. సాధారణ బస్సు కండక్టర్ గా ఉన్న రజనీకాంత్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇటీవల ఆయన నటించిన జైలర్ సినిమా 110 కోట్లు వసూలు చేసింది.
అల్లు అర్జున్ ఆస్తులు 350 కోట్లు
అల్లు అర్జున్ కెరీర్ పుష్ప సినిమాతో మారిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కురిపించింది. పుష్ప-2 పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పుష్ప సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అల్లు అర్జున్ కు దక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ సమీప బంధువు.
ప్రభాస్ సంపద 241 కోట్లు
ప్రభాస్ తాజాగా కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఆయన సంపద విలువ 241 కోట్లు. ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదాలు నడిచాయి. కానీ, ఇటీవల ఆయన నటించిన సలార్ సినిమా 369.37 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాను మించి ఈ సినిమా వసూళ్లు చేసింది.
అజిత్ కుమార్ ఆస్తులు 196 కోట్లు
అజిత్ కుమార్ దక్షిణాదికి చెందిన మరో అగ్రశ్రేణి యాక్టర్. ఆయన ఆస్తుల విలువ 130 కోట్లు. గత ఏడాది ఆయన నటించిన తునివు సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 130 కోట్లు వసూలు చేసింది.
ఏ హీరో రెమ్యూనరేషన్ ఎంత?
1. షారూక్ ఖాన్: రూ. 150 - రూ.250 కోట్లు
2. రజనీకాంత్ : రూ. 150 -210 కోట్లు
3. జోసెఫ్ విజయ్ : రూ.130 -200 కోట్లు
4. ప్రభాస్: రూ. 100 -200 కోట్లు
5. అమీర్ ఖాన్ : రూ. 100-175 కోట్లు
6. సల్మాన్ ఖాన్ : రూ. 100- 150 కోట్లు
7. కమల్ హసన్: రూ. 100 -150 కోట్లు
8. అల్లు అర్జున్ : రూ. 100 -125 కోట్లు
9. అక్షయ్ కుమార్: రూ. 60 -145 కోట్లు
10. అజిత్ కుమార్: రూ. 105 కోట్లు
ఇక హలీవుడ్ నటులు టైలర్ పెర్రీ నికర సంపద సుమారు 1 బిలియన్ డాలర్లతో సంపదలో అగ్రస్థానంలో నిలిచారు.950 మిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో జెర్రీ సెయిన్ఫెల్డ్ నిలిచారు. మూడో స్థానంలో 800 మిలియన్ డాలర్లతో డ్వేన్ జాన్సన్ ఉన్నారు. ఇండియాకు చెందిన షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న నటులుగా రికార్డులకెక్కారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire