‌వర్మకు షాక్‌.. దిశ సినిమాకు సెన్సార్ నుంచి నో క్లియరెన్స్

‌వర్మకు షాక్‌.. దిశ సినిమాకు సెన్సార్ నుంచి నో క్లియరెన్స్
x
Highlights

*దిశ సినిమాకు అనుమతి ఇవ్వని సెన్సార్ బోర్డ్‌ *దిశ మూవీకి క్లియరెన్స్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరణ *రివిజన్ కమిటీకి వెళ్లనున్న దిశ సినిమా

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిజజీవిత కథల ఆధారంగా పలు చిత్రాలను రిలీజ్ చేస్తూ.. వివాదాలను కేంద్ర బిందువు అవుతున్న వర్మకు ఈ సారి సెన్సార్ బోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన దిశ సినిమాకు సెన్సార్ బోర్డ్‌ అనుమతి నిరాకరించింది. దిశ మూవీకి క్లియరెన్స్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించడంతో.... రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. దిశ మూవీలో రియల్ ఎన్‌కౌంటర్‌ను పోలిన సీన్లు ఉండటంతో.... బాధితురాలి కుటుంబం కూడా తీవ్ర అభ్యంతరం చెబుతోంది.

దిశ సినిమాలో ఎవరిని కించపరిచే విధంగా సీన్లు లేవని నిర్మాత నట్టి కుమార్ వివరణ ఇచ్చారు. సినిమాపై అపోహ పెట్టుకుని విడుదల కాకుండా చూస్తున్నారన్నారు. గతంలో మర్డర్ సినిమాకు కూడా ఇలానే వివాదం సృష్టించారన్నారు. మర్డర్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుందని గుర్తు చేశారు.. దిశ మూవీ సెన్సార్ ను ఇక్కడి ఈసీ రిజెక్ట్ చేసి.. రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారని ప్రొడ్యుసర్ నట్టికుమార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories