RGV: స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా అరెస్టు చేస్తారా..వర్మ మరో పోస్టు

RGV: స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా అరెస్టు చేస్తారా..వర్మ మరో పోస్టు
x
Highlights

RGV: రామ్ గోపాల్ వర్మ..ఈ పేరులోనే సంచలనం ఉంది. ఎందుకంటే ఆయన సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. గత కొన్నాళ్లుగా వరుస వివాదాలతో నిలుస్తున్నారు. వైసీపీ హయాంలో...

RGV: రామ్ గోపాల్ వర్మ..ఈ పేరులోనే సంచలనం ఉంది. ఎందుకంటే ఆయన సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. గత కొన్నాళ్లుగా వరుస వివాదాలతో నిలుస్తున్నారు. వైసీపీ హయాంలో కూటమి నేతలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్నాయి. వీటిపై కూడా వర్మ తనదైన స్టైల్లో సెటైరికల్ పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తనపై కేసు నమోదు అయినప్పటికీ వర్మ ఏమాత్రం భయపడకుండ పోలీసులకు వరుస ప్రశ్నలను సందిస్తూనే ఉన్నారు.

తనపై ఇలా కేసులు నమోదు అవ్వడంతో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జును అరెస్ట్ అవ్వడంతో బన్నీకి సపోర్టుగా నిలిచాడు ఆర్జీవీ. అంతేకాదు బన్నీ అరెస్టును ఖండించారు. ఈ విషయం ఆర్జీవీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే తాజాగా ఆర్జీవీ చేసిన ఓ పోస్టు సంచలనం క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు సినిమా పరిశ్రమ మొత్తం తీవ్రంగా ఖండించాలని పోస్టులో పేర్కొన్నారు. ఒక సెలబ్రిటీ అయిన రాజకీయ నాయకులైనా పాపులర్ అవ్వడం వారి తప్ప అంటూ ప్రశ్నించారు ఆర్జీవీ. అలా అయితే క్షణ క్షణం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూసేందుకు వచ్చని వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. అంటే ఇప్పుడు స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా అరెస్టు చేస్తారా పోలీసులు అంటూ ప్రశ్నించారు. అల్టు అరెస్టును ఉద్దేశించి శ్రీదేవి అరెస్టు ప్రస్తావనకు తీసుకురావడంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వర్మ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories