అప్పుడు చిరంజీవే కనక లేకపోతే.. శరత్ కుమార్ ఎమోషన్!

అప్పుడు చిరంజీవే కనక లేకపోతే.. శరత్ కుమార్ ఎమోషన్!
x
Sharath Kumar (File Photo)
Highlights

మెగాస్టార్ చిరంజీవి ... ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వారికి, రాబోయే వారికి ఆయనే ఇన్స్పిరేషన్..

మెగాస్టార్ చిరంజీవి ... ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వారికి, రాబోయే వారికి ఆయనే ఇన్స్పిరేషన్.. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి చాలామందికి ఇన్స్పైర్ గా నిలిచారు. కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేసేందుకు చిరు ఎప్పుడు ముందే ఉన్నారు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలేమో..

చిరంజీవి, రాధిక టాలీవుడ్ లో బెస్ట్ జోడీ... రియల్ లైఫ్ కూడా వీరు, వీరి కుటుంబాలు కూడా మంచి సానిహిత్యంగా ఉంటాయి.. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి ముప్పై ఏళ్లు నిండడంతో చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ఓ ఛానెల్‌లో రాధిక, శరత్ కుమార్ మాట్లాడారు.

ఈ సంద్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. చాలా ఎమోషన్ అయ్యారు. తాను కెరీర్లో డౌన్ ఫాల్ లో ఉన్న సమయంలో అప్పులపాలు అయ్యానని అప్పుడు ఓ నిర్మాత తన దగ్గరికి వచ్చి చిరంజీవి డేట్స్ పట్టుకొస్తే నీకు డబ్బులు వస్తాయని , తద్వారా నీ అప్పులన్నీ తీరిపోతాయనీ సలహా ఇచ్చాడని దీనితో ఒక రోజు చిరంజీవిని కలవడానికి ఫోన్ చేసి హైదరాబాద్ కి వెళ్లానని శరత్ కుమార్ వెల్లడించారు..

అప్పుడు చిరంజీవి ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని, అయినప్పటికీ మధ్యాహ్నం షూటింగ్ క్యాన్సల్ చేసి తన ఇంటికి తీసుకు వెళ్లి అన్నం పెట్టి సమస్య ఏంటో చెప్పమన్నాడని శరత్ కుమార్ అన్నారు. అప్పుడు నీ డేట్స్ కావాలి.. నాకున్న అప్పులు తీరిపోతాయ్ అని చిరును అడిగినట్టుగా శరత్ కుమార్ వెల్లడించారు..

దీనికి చిరు వెంటనే స్పందించి ఏమీ ఆలోచించకుండా తన తదుపరి చిత్రం యొక్క డేట్లు ఇచ్చేసారని అయితే అప్పుడు రెమ్యూనరేషన్ ఎంత? అని నేను అడిగితే.. నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా? అని ఫైర్ అయ్యాడని, అంతేకాకుండా కష్టాల్లో ఉన్నానని చెప్పావ్‌గా నాకు రెమ్యూనరేషన్ వద్దని చిరు అన్నారని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శరత్ కుమార్ ఎమోషనల్ అయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories