అద్దె ఇంట్లో ఉంటున్నాం.. దయచేసి సాయం చేయండి.. కాంతారావు కొడుకు ఎమోషనల్‌..

Senior Actor Kantha Rao Son Raja Emotional Words
x

అద్దె ఇంట్లో ఉంటున్నాం.. దయచేసి సాయం చేయండి.. కాంతారావు కొడుకు ఎమోషనల్‌..

Highlights

Kantha Rao: అలనాటి హీరో కాంతారావు శ‌త జ‌యంతోత్సవం ర‌వీంద్ర భార‌తిలోని పైడి జ‌య‌రాజ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో ఘ‌నంగా నిర్వహించారు.

Kantha Rao: అలనాటి హీరో కాంతారావు శ‌త జ‌యంతోత్సవం ర‌వీంద్ర భార‌తిలోని పైడి జ‌య‌రాజ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీశారని చెప్పారు.

ఒకప్పుడు మద్రాస్ బంగ్లాలో ఉన్న మేము.. ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి తమకు ఇల్లు కేటాయించాలని కోరారు. పరిశ్రమ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి మాకు ఓ ఇల్లు కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories