Seetimaarr: గోపీచంద్ 'సీటీమార్' ఓటీటీ రిలీజ్?

Seetimaarr:
x

సీటిమార్ ఫైల్ ఫోటో 


Highlights

Seetimaarr: సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ -తమన్నా హీరోహీరోయిన్ల‌గా రూపొందిన చిత్రం 'సీటీమార్'.

Seetimaarr: సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ -తమన్నా హీరోహీరోయిన్ల‌గా రూపొందిన చిత్రం 'సీటీమార్'. ఎప్పుడో విడుదల కావాల్సిన కొన్నికార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అన్ని అడ్డంకులు దాటుకొని గ‌త నెల‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాకు క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది . అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి థియేటర్లు తెరిచే వరకూ ఎదురుచూడటం కూడా కష్టమే. అందువలన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

గోపీచంద్ కి పంతం సినిమా త‌ర్వాత హిట్ లేదు ..ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. క్రీడా నేపథ్యంలోని కథ కావడం .. భారీ బడ్జెట్ తో నిర్మించడం వలన ఆయన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. సంప‌త్ నంది కూడా చాలా కాలం త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను మొద‌ట థియేట‌ర్లో విడుద‌ల చేసి.. త‌ర్వాత ఓటీటీ వైపు మొగ్గు చూడాలని అంతా భావించారు. అయితే క‌రో్నా సెకండ్ వేవ్ ఎన్నాళ్లుంటుందో తెలియ‌దు. థియేట‌ర్లు తెరుచుకునే వర‌కు ఆగాలంటే కొన్ని స‌మ‌స్య‌లు మ‌ళ్లి వ‌స్తాయి. అయితే ఓటీటీ వైపు వెళ్లాని నిర్మాత భావించాడ‌ని తెలుస్తోంది.

ఇక ఇప్ప‌టికే ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నెల ఆఖ‌ర్లో ఓటీటీలో సినిమా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింద‌ట‌. అయితే ముందుగా కూదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం సినిమా థియేట‌ర్లో విడుద‌ల చేసిన త‌ర్వాతే ఓటీటీలో ప్ర‌సారం చేయాల‌ని నిర్ణ‌యించుకుంట‌. ఇప్ప‌ట్లో థియేట‌ర్లు ఓపెన్ చేసే ప‌రిస్థితులు లేవు.. ఒక‌వేళ థియేట‌ర్లు తీసినా ప్రేక్ష‌కులు ఎంత‌వ‌ర‌కు థియేట‌ర్లు వ‌స్తారో తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారంట‌. ఎమో చూద్దాం.. ఈ సినిమా అనుకున్న‌ట్లుగానే థియేట‌ర్ల‌లో వ‌స్తుందా? ఓటీటీలో రిలీస్ అవుతుందా? .

శ్రీనివాస సిల్వ‌ర్ స్ర్కీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాలో సూర్యావ‌న్సి, భూమిక‌, రెహ్మాన్, రావుర‌మేశ్,పోస‌ని కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories