Sathyam Sundaram OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫీల్‌ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Sathyam Sundaram OTT
x

Sathyam Sundaram OTT

Highlights

Sathyam Sundaram OTT: కార్తీ, అరవింద్‌ స్వామి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'సత్యం సుందరం'. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది.

Sathyam Sundaram OTT: కార్తీ, అరవింద్‌ స్వామి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'సత్యం సుందరం'. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఫీల్‌ గుడ్ మూవీగా వచ్చిన సత్యం సుందరం ప్రేక్షకులను మెప్పించింది. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. '96' మూవీతో ప్రేక్షకులను మెప్పించిన ప్రేమ్‌ కుమార్‌ సత్యం సుందరం మూవీతో ప్రేక్షకులకు మరో మంచి అనుభూతిని అందించారు.

ఒక రాత్రిలో జరిగే కథను అద్భుతంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 28వ తేదీన థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. నెల రోజులు తిరిగే లోపే ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకీ కథేంటంటే..

సత్యమూర్తి (అరవింద స్వామి).. కొన్ని కారణాల వల్ల సొంతూరిని వదిలేసి వెళ్లిపోతాడు. కుటుంబ సభ్యులతో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా సొంతూరులో ఇంటిని వదిలేసి పట్టణానికి వలసవెళ్తాడు. ఊరిపై, అక్కడి ప్రజలపై ద్వేషం పెంచుకొని అసలు సొంతూరికి రావడమే మానేస్తాడు. అయితే పాతికేళ్ల తర్వాత తన పెదనాన్న కూతురి వివాహం కోసం సత్యమూర్తి కుటుంబం తిరిగి గ్రామానికి వస్తుంది. అదే సమయంలో సుందరం (కార్తీ)తో సత్యమూర్తికి పరిచయం ఏర్పడుతుంది. సుందరం బావ అంటూ సత్యంను కలుస్తాడు.

అయితే పాతికేళ్ల తర్వాత వచ్చిన సత్యమూర్తికి సుందరం ఎవరో తెలియదు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, చివరికి ఏమైందన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కార్తీ, అర‌వింద్ స్వామి మ‌ధ్య వ‌చ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఎమోషన్‌ సీన్స్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories