Sankranthiki Vasthunam Day 1 Collection: సంక్రాంతికి వస్తున్నాం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Sankranthiki Vasthunam Box Office Collection Day 1 Report
x

Sankranthiki Vasthunam Day 1 Collection: సంక్రాంతికి వస్తున్నాం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Highlights

Sankranthiki Vasthunam Day 1 Collection: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్‌2, ఎఫ్3 సినిమాలు సక్సెస్ అయ్యాయి.

Sankranthiki Vasthunam Day 1 Collection: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్‌2, ఎఫ్3 సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి సూపర్ హిట్ సాధించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటి రోజే ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.

పండగకి వచ్చారు.. పండుగని తెచ్చారు అంటూ ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే వెంకటేష్ కెరీర్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్‌లో తొలిరోజు సినిమా సుమారు 7 లక్షల డాలర్ల వసూళ్లు చేసింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఫన్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీల మధ్య కామెడీ విపరీతంగా ఆడియెన్స్‌‌ను ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకీ తనదైన కామెడీతో అదరగొట్టారంటున్నారు అభిమానులు. అయితే సినిమా సక్సెస్‌కు భీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన పాటలు మంచి హైప్ తీసుకొచ్చాయి. పండగపూట ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని సంక్రాంతి వస్తున్నాం సినిమా అందించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

వెంకటేష్‌కు ఇటీవల కాలంలో సరైన హిట్ పడలేదు. ఎఫ్2 తర్వాత ఆయన చేసిన ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకటేష్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిందంటున్నారు ఫ్యాన్స్. విక్టరీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఆదివారం వరకు పండగ సీజన్ కావడంతో.. మరో నాలుగు రోజులు ఈ మూవీ పంట పండుతుందని చెప్పొచ్చు. పండగ టైమ్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం ఈ మూవీకి బాగా కలిసొచ్చింది.

వెంకటేష్ నుంచి ఇరవై ఏళ్ల క్రితం ఫ్యామిలీ మూవీస్ ఎక్కువగా వచ్చాయి. అందులో కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు అప్పట్లో ఎంతగానో అలరించాయి. ఈ సినిమా ద్వారా ఆ రోజులు గుర్తొచ్చాయంటున్నారు ఆడియన్స్. అందుకే విక్టరీ వెంకటేష్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలను అందుకుంటుందో చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories