Sameera Reddy: ఆ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమీరా..!

They forced me to undergo that surgery Sameera made sensational comments
x

Sameera Reddy: ఆ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమీరా

Highlights

Sameera Reddy: సమీరా రెడ్డి.. ఈ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Sameera Reddy: సమీరా రెడ్డి.. ఈ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2002లో హిందీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత 2004లో నరసింహుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత జై చిరంజీవలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన ఆడిపాడిందీ బ్యూటీ.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. అనంతరం వివాహం చేసుకొని సెటిల్‌ అయ్యింది. ఇక చివరిగా రానా హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్‌'లో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటుందీ చిన్నది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమీర పలు సంచలన కామెంట్స్‌ చేసింది. తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి గుర్తు చేసుకుంది.

తన కెరీర్‌ టాప్‌లో ఉన్న సమయంలో తనపై కొందరు ఒత్తిడి చేశారని. బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారని తెలిపింది. అయితే దానిని తాను నో చెప్పండంతో.. ‘ఎంతోమంది హీరోయిన్లు చేయించుకున్నారు. నీకేమైంది’ అనేవారని వాపోయింది. అయితే ఎవరెన్నీ చెప్పినా తాను మాత్రం సర్జరీకి నో చెప్పానని సమీరా చెప్పుకొచ్చింది. ఇక ఆ సమయంలో తాను చాలా బాధపడ్డానని, శరీరంతో ఎలాంటి సమస్య లేనప్పుడు సర్జరీ ఎందుకు చేసుకోవాలని ప్రశ్నించానని గతాన్ని గుర్తు చేసుకుంది.

ఇక తాను అందరిలా వయసును దాచేయనని, గూగుల్లో తన వయసు రెండేళ్లు తక్కువ చూపిస్తుంటే దాన్ని సరిచేశానని తెలిపింది. 40ఏళ్లు పైబడినా నేను ఎంతో ఉత్సాహంగా ఉంటున్నానని. తన చర్మం డల్‌గా ఉన్నప్పుడూ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తానని చెప్పుకొచ్చింది. మేకప్‌ వేసుకున్నప్పుడు కూడా ఫొటోలను షేర్‌ చేస్తానని తెలిపిన సమీరా.. అలా చేయడం వల్ల తనలాంటి ఎంతోమంది మహిళలు స్ఫూర్తిపొందుతారని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories