Samantha: పెళ్లిపై సమంత ఆసక్తికర కామెంట్లు

Samantha Shares Inspiring Post on Daughters
x

Samantha: పెళ్లిపై సమంత ఆసక్తికర కామెంట్లు

Highlights

Samantha: టాలీవుడ్ సార్ కపుల్ సమంత మరియు నాగచైతన్య ఈ మధ్యనే తమ విడాకులని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Samantha: టాలీవుడ్ సార్ కపుల్ సమంత మరియు నాగచైతన్య ఈ మధ్యనే తమ విడాకులని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి విడాకుల కారణాలు ఇవే అంటూ బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి కానీ వీరిద్దరూ మాత్రం ఈ పుకార్లపై మౌనం వహించారు. అయితే తాజాగా 'పెళ్లి'పై ఓ ఆసక్తికర సందేశాన్ని షేర్‌ చేశారు సమంత.

''మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆమె పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు మంచి చదువు చదివించి తన కాళ్లపై తాను నిలబడేలా చేయండి. పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో బ్రతకడం నేర్పించండి. అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి'' అంటూ సందేశమిచ్చింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో తెగ చర్చనీయాంశంగా మారింది.



Show Full Article
Print Article
Next Story
More Stories