Samantha: అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా.. సమంత సంచలన పోస్ట్..

Samantha Seeks Loyal And Loving Partner
x

Samantha: అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా.. సమంత సంచలన పోస్ట్..

Highlights

Samantha: సినీ నటి సమంత పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Samantha: సినీ నటి సమంత పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సమంత తన రాశి గురించి 2025 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సందేశం షేర్ చేశారు. ఇందులో వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో అత్యంత విజయవంతంగా ఉంటారని.. వారు కొన్ని ముఖ్యమైన విషయాలను సాధించగలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తం బిజీగా ఉంటూ వృత్తి పరంగా మెరుగుదల సాధిస్తారని.. ముఖ్యంగా ప్రేమ, నమ్మకం ఇచ్చే భాగస్వామిని పొందుతారని.. మానసిక, శారీరకంగా బలంగా ఉంటూ పిల్లలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందేశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న విధంగా మీకు అన్ని సంతోషాలు కలగాలంటూ సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. సిటడెల్ తో ప్రేక్షకులను అలరించిన సమంత.. ఇప్పుడు తన రాబోయే సిరీస్ రక్త్ బ్రహ్మాండ్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ సెట్లోకి అడుగుపెట్టిన సమంత.. సామాజిక మాధ్యమాలలో ఈ విషయం షేర్ చేస్తూ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories