ఒక్కరోజులో పదిహేను లక్షల లైకులు.. సమంత రేంజి ఒకరకంగా లేదుగా!

samantha latest Instagram images
x

సమంత తాజా ఫోటో (ఇంస్టాగ్రామ్ నుంచి సేకరించింది)

Highlights

సమంత.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.

సమంత.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది. తన కెరీర్ మరింత పీక్ లోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తోందో ఏమో..కుర్రకారు మతి పోగొట్టే పిక్స్ తో ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తోంది. ఇటీవలే తన కొత్త బిజినెస్ సాకీ కోసం ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో ఉంచి సందడి చేసిన శామ్ ఇప్పుడు సరికొత్తగా ఓ పిక్ వదిలింది. ఈ పిక్ ఇప్పుడు టాప్ ట్రేండింగ్ లో ఉంది.

ఈ పిక్ పెట్టిన గంటలో లక్షా ఏభైవేల లైక్ లు సొంతం చేసుకుంది. ఒక్కరోజులో పదిహేను లక్షల మంది సమంత తాజా ఫోటోను లైక్ చేశారు. దీనిని బట్టి సమంత క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది.

ఇక పొతే, ప్రస్తుతం సమంత శామ్ జామ్ షో తో బిజీగా ఉంది. యాంకర్ గానూ ఆహాలో అదరగొట్టేస్తోంది. ఇక ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె పెట్టిన పిక్ కూడా తన తాజా సినిమాకి సంబంధించినది కావచ్చని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఆ పిక్ దేనికోసం సమంత ఇంస్టాగ్రామ్ లో పుట్టిందో తెలీదు కానీ.. ఒక రేంజిలో అభిమానులను ఆకట్టుకుంటోంది.

సమంత తాజా ఫోటోలు మీరూ ఓ లుక్కేయండి (ఇమేజి సోర్స్.. సమంత ఇంస్టాగ్రామ్)


Show Full Article
Print Article
Next Story
More Stories