Samantha: మొట్టమొదటి దక్షిణాది నటిగా మారిన సమంత

Samantha Gets a Chance to be the Speaker of the International Film Festival of India
x

అరుదైన గౌరవం దక్కించుకున్న సమంత (ఫైల్ ఇమేజ్)

Highlights

Samantha: అరుదైన గౌరవం దక్కించుకున్న సమంత

Samantha: ఈ మధ్యనే నాగచైతన్యతో తన విడాకులని ప్రకటించిన సమంత సినిమాల పరంగా తన వేగాన్ని మరింత పెంచారు. వరుస సినిమాలు సైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా సమంత భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటోంది ఈ నేపథ్యంలో గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా'(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి సామ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల గోవాలో జరిగే 'ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా'(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం అందింది.

దీంతో ఈ ఈవెంట్ లో స్పీకర్ గా ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వక్తగా సమంతతో పాటు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయిను కూడా ఎంపిక చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. ఈ ఫెస్టివల్ నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. ఇక సినిమాల పరంగా చూస్తే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" సినిమాతో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories