Samantha: తన ఆరోగ్య పరిస్థితి గురించి క్లారిటీ ఇచ్చిన సమంత

Samantha Gave Clarity About her Health Condition
x

Samantha: తన ఆరోగ్య పరిస్థితి గురించి క్లారిటీ ఇచ్చిన సమంత

Highlights

Samantha: తన ఆరోగ్య పరిస్థితి గురించి క్లారిటీ ఇచ్చిన సమంత

Samantha: స్టార్ బ్యూటీ సమంత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత హీరోయిన్గా విడుదలైన యశోద సినిమా సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంకా తాగు కొద్ది రోజులుగా సమంత ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని సమంత కోలుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరో వైపు సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రతి నెల సమంత ఐవీఐజీ ఫ్లూయిడ్ లను ఎక్కించుకుంటోంది.

ఈ విషయాన్ని సమంత స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. తన స్నేహితులు ఆ సమయంలో తనకు తోడుగా ఉంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ స్నేహితులు ఎవరో కాదు నటుడు, డైరెక్టర్ ఆయన రాహుల్ రవీంద్రన్ మరియు ఫిమేల్ డైరెక్టర్ నందిని రెడ్డి. రాహుల్ రవీంద్రన్ మరియు నందిని రెడ్డి సమంతా కి ఎప్పటినుంచో మంచి స్నేహితులు. తాజాగా సమంత సెలైన్ బాటిల్ నువ్వు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

"మంత్లీ ఐవీఐజీ పార్టీ.. ఇదే నా న్యూ నార్మల్," అంటూ రాహుల్ రవీంద్రన్ మరియు నందిని రెడ్డి కూర్చుని మాట్లాడుకుంటున ఫోటోను షేర్ చేసింది సమంత. దీంతో సమంత ఇంకా పూర్తిగా కోలుకోలేదని అని తెలుస్తోంది. ఇక సినిమాలపరంగా చూస్తే సమంత త్వరలోనే గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories