పూజా హెగ్డే ను క్షమించేసిన సమంత?

Samantha And Pooja Hegde Become Friends
x

స్నేహితులుగా మారిన సమంత మరియు పూజా హెగ్డే

Highlights

Samantha: పూజా హెగ్డే ను క్షమించేసిన సమంత.

Samantha: ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంటూ పుకార్లు వినిపించాయి కానీ ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లు అయినా వారి మధ్య ఇలాంటి వైరం కనిపించడం లేదు. ఈ మధ్యనే పూజా హెగ్డే మరియు విజయ్ నటిస్తున్న ఒక సినిమా నుంచి "అరబిక్ కుతు" పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకి డాన్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టింది సమంత. "లేట్ నైట్ ఫ్లైట్ లేట్ అయింది. ఇవాల్టి పాట అరబిక్ కుతు" అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియో ని షేర్ చేసింది సమంత.

సమంత డాన్స్ వీడియో ని పూజా హెగ్డే కూడా షేర్ చేస్తూ "అమేజ్" అంటూ చెప్పుకొచ్చింది. గతంలో పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో సమంత గురించి ఒక షాకింగ్ పోస్ట్ పెట్టి తర్వాత ఇంస్టాగ్రామ్ హాక్ అయింది అంటూ చెప్పింది. ఆ తర్వాత సమంత కూడా ఆమెపై జోకులు వేసింది. ఇక ఈ పాటకి డాన్స్ చేస్తూ సమంత వారి మధ్య వైరం లేదని చెప్పకనే చెబుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఈ మధ్య కాలంలో వారి మధ్య ఇలాంటి వైరాలు ఉండటం లేదని అందరి మధ్య హెల్తీ కాంపిటేషన్ మాత్రమే ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories