Sai Pallavi: బలగం వేణు ఎల్లమ్మ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్?‌

Sai Pallavi To Star In Venu Yeldandis Film Yellamma
x

Sai Pallavi: బలగం వేణు ఎల్లమ్మ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్?‌

Highlights

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించబోతున్న ఎల్లమ్మ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేసినట్టు సినీ వర్గాల టాక్. సాధారణంగా కథల ఎంపిక విషయంలో సాయిపల్లవి సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా చేయడానికి ఇష్టపడుతుంది. దీంతో ఎల్లమ్మ పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.

వేణు బలగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. దీంతో తదుపరి చిత్రంగా ఎల్లమ్మను తెరకెక్కించబోతున్నారు. వేణు ఎప్పటినుంచో ఈ సినిమా చేయాలని హీరోలందరికీ కథ చెబుతూ ఉన్నాడు. మొదట ఈ కథను నానికి వినిపించారని.. స్టోరీ నచ్చకపోవడంతో నాని నో చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత శర్వానంద్, తేజ సజ్జా, హీరో నితిన్‌కి వినిపించగా.. నితిన్ ఒకే చెప్పారని సమాచారం. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ 2025 ఫిబ్రవరి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

సాయి పల్లవి ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్టు కొట్టారు. ప్రస్తుతం తెలుగులో తండేల్, హిందీలో రామాయణం సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తండేల్ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories