Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ "రిపబ్లిక్" మూవీ రివ్యూ

Sai Dharam Tej Republic Movie Review and Rating | hmtvlive.com
x

రిపబ్లిక్ సినిమా రివ్యూ 

Highlights

* శుక్రవారం 01 10 2021 విడుదలైన సాయి ధరమ్ తేజ్ "రిపబ్లిక్" మూవీ

Republic Movie Review: "సోలో బ్రతుకే సో బెటర్" అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇప్పుడు "రిపబ్లిక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కి వెన్నెల, ఆటోనగర్ సూర్య, ప్రస్థానం ఫేమ్ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వం వహించారు.

ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరుణవల్ల చాలా కాలం వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ అనగా అక్టోబర్ 1, 2021 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

చిత్రం: రిపబ్లిక్

నటీనటులు: సాయి తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ తదితరులు

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: ఎమ్ సుకుమార్

నిర్మాతలు: జే భగవాన్, జే పుల్లా రావు

దర్శకత్వం: దేవ కట్ట

బ్యానర్: జీ స్టూడియోస్, జే బీ ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేదీ: 01/10/2021

కథ:

అభిరామ్ (సాయి తేజ్) ఎప్పుడు సమాజంలో ఉండే తప్పులను వేలెత్తి చూపడంలో ముందుంటాడు. తన తండ్రి (జగపతి బాబు) ఒక అవినీతిపరుడైన గవర్నమెంట్ అధికారి. తన చుట్టూ జరుగుతున్న అవినీతిని చూసి తట్టుకోలేక అభిరామ్ ఐఏఎస్ గా మారతాడు. తన సొంత ఊరిలోనే పోస్టింగ్ వేయించుకుంటాడు అభిరామ్.

అక్కడే తనకి రాజకీయ నాయకురాలు విశాఖ వాణి (రమ్యకృష్ణ) నుంచి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అభిరామ్ వాటిని ఏవిధంగా ఎదుర్కొన్నాడు, తన సొంతూరిలోని అవినీతిని ఎంతవరకు కట్టడి చేయగలిగాడు? చివరికి ఏమైంది? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

అభిరామ్ అనే ఇంటెన్స్ పాత్రలో సాయిధరమ్తేజ్ చాలా చక్కగా ఒదిగిపోయి చాలా బాగా నటించారు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమేకాక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు సాయి తేజ్. ఐశ్వర్య రాజేష్ కు ఈ సినిమాలో పెద్ద పాత్ర ప్రాముఖ్యత లేదని చెప్పుకోవచ్చు.

అయినప్పటికీ ఉన్న నిడివిలో ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో చాలా బాగా నటించింది. రమ్య కృష్ణ పాత్ర ఫస్టాఫ్ లో కనిపించడం చాలా తక్కువ. ఇక అవినీతిపరులైన ఒక రాజకీయ నాయకులు చాలా బాగా నటించింది. ఆమెకి, తేజ్ కి మధ్య జరిగే ఒక కన్ఫ్రన్టేషన్ సన్నివేశం చాలా బాగుంటుంది. జగపతి బాబు హీరో తండ్రి పాత్రలో చాలా బాగా నటించారు.

సాంకేతికవర్గం:

దర్శకుడు దేవకట్టా ఈ సినిమాతో సమాజంలో ఉన్న కీలకమైన సమస్యలన్నిటిని చూపించాలని అనుకున్నారు. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు బాగా డ్రాగ్ చేసినట్లు అనిపించటం ప్రేక్షకులకు బోర్ కొట్టించచ్చు. అయితే దేవకట్టా క్లైమాక్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని మంచి అవుట్ పుట్ ని ఇచ్చారు.

మణిశర్మ అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలు నేపథ్య సంగీతం సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కెమెరా వర్క్ మరియు ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించాయి.

బలాలు:

  • కథ
  • నటీనటులు
  • డైలాగ్స్
  • క్లైమాక్స్

బలహీనతలు:

  • కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
  • కథ ప్రెడిక్టబుల్ గా ఉండటం
  • కొన్ని స్లో సన్నివేశాలు

చివరి మాట:

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని ఏమాత్రం డీవియేట్ అవ్వకుండా చాలా బాగా నెరేట్ చేశారు. శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, మరియు న్యాయ వ్యవస్థలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఈ సినిమా ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపించారు దేవకట్ట. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో వచ్చే డైలాగులు ఆలోచింప చేసే విధంగా ఉంటాయి.

కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా కలగలిసి ఉంటే సినిమా మరింత బాగుండేది అనిపిస్తుంది. అయితే రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఒక పూర్తి పొలిటికల్ డ్రామా గా తీర్చిదిద్దారు.

బాటమ్ లైన్:

రాజ్యాంగం మరియు వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చూపించిన "రిపబ్లిక్".

Show Full Article
Print Article
Next Story
More Stories