మరో మెగా పెళ్లి కబురు !

మరో మెగా పెళ్లి కబురు !
x
Highlights

నిహారిక-చైతన్యల వివాహంతో ఇటీవల మెగా వారింట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఇప్పుడు మెగా కాంపౌండ్‌ నుంచి త్వరలో మరో పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ...

నిహారిక-చైతన్యల వివాహంతో ఇటీవల మెగా వారింట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఇప్పుడు మెగా కాంపౌండ్‌ నుంచి త్వరలో మరో పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిరు మేనల్లుడు సాయితేజ్‌ బయటపెట్టారు. వచ్చే ఏడాదిలో తమ కుటుంబంలో మరో వివాహం జరగొచ్చని అన్నారు.

నిహారిక వివాహం తర్వాత సాయితేజ్‌ పెళ్లి చేసుకోనున్నారని.. పెళ్లికుమార్తె కూడా ఫిక్స్‌ అయ్యిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ అవాస్తమని సాయితేజ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి మరోసారి స్పందించారు. తనకంటే ముందు అల్లు శిరీష్‌ వివాహం జరగవచ్చన్నారు. ఇక ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు సంబరంలో మునిగితేలుతున్నారు. త్వరలోనే ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు కొణిదెల కుటుంబంలో మరో పెద్ద పండగ రాబోతుందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories