Dakshina Movie: మంత్ర డైరెక్టర్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. విడుదలకు సిద్ధమైన 'దక్షిణ'..

Dakshina Movie: మంత్ర డైరెక్టర్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. విడుదలకు సిద్ధమైన దక్షిణ..
x

Dakshina Movie: మంత్ర డైరెక్టర్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. విడుదలకు సిద్ధమైన 'దక్షిణ'..

Highlights

Dakshina Movie: మంత్ర , మంగళ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Dakshina Movie: మంత్ర , మంగళ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థ్రిల్లర్‌ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాలతో దర్శకుడు ఓషో తులసిరామ్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే దర్శకుడి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'దక్షిణ'. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకిగా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిమాను అక్టోబర్‌ 4వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్, ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు గారు విడుదల చేసారు. అక్టోబర్ 4న దక్షిణ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. థ్రిల్లింగ్ సినిమాలకు సరికొత్త డిఫనేషన్ ఈ సినిమా నిలవబోతోందని చిత్రయూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

సైకో థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా ఉంది. వరుసగా జరుగుతోన్న మహిళలను హత్య చేస్తోంది ఎవరు.? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందన్న అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాను నైజాలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని నిర్మాత అశోక్ షిండే తెలిపారు. ఈ చిత్రంలో సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరితో పాటు పలువురు నటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories