సాహో 'బ్యాడ్ బాయ్' మేనియా!

సాహో బ్యాడ్ బాయ్ మేనియా!
x
Highlights

ప్రభాస్ నటించిన భారీ చిత్రం సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా టీం రోజుకో కొత్త పద్ధతిలో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన బాడ్ బాయ్ అనే పాత రికార్డులు సృష్టిస్తోంది.

సోషల్ మీడియాను సాహో కుదిపేస్తోంది. ట్విట్టర్.. ఫేస్ బుక్ ఇలా ఎక్కడ చూసినా సాహో గురించి చర్చలే. ఆ సినిమా విశేషాలే. విడుదలకు కొన్ని రోజులే ఉండడంతో సాహో టీం కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సాహో నుంచి ఏది వచ్చినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతోంది. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇటీవల చిత్రంలోని బ్యాడ్ బాయ్ పాటను విడుదల చేశారు. ఈ పాట ఇలా విడుదలైందో లేదో.. అలా రికార్డు సృష్టించేసింది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా నిలిచింది. 24 గంటల్లో 85.24 లక్షల మంది ఈ పాటను వీక్షించగా, 3.58 లక్షల మంది లైక్ కొట్టారు.

ఆగస్ట్ ౩౦న ప్రపంచ వ్యాప్త్రంగా విడుదల కానున్న ఈ భారీ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ నటించారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories