మహాబలేశ్వర్ కొండల్లో RRR షూటింగ్

మహాబలేశ్వర్ కొండల్లో RRR షూటింగ్
x
Highlights

కరోనా వలన వాయిదా పడిన త్రిబుల్ ఆర్ షూటింగ్ తిరిగి శేరవేగంగా జరుపుకుంటుంది. ఈ మధ్య చలిలో రాత్రి వేళలో భారీ షెడ్యుల్ ని పూర్తి చేసుకున్న జక్కన్న టీం ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని మహాబలేశ్వర్ లోని కొండల్లో మరో షెడ్యుల్ ని మొదలు పెట్టింది

కరోనా వలన వాయిదా పడిన త్రిబుల్ ఆర్ షూటింగ్ తిరిగి శేరవేగంగా జరుపుకుంటుంది. ఈ మధ్య చలిలో రాత్రి వేళలో భారీ షెడ్యుల్ ని పూర్తి చేసుకున్న జక్కన్న టీం ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని మహాబలేశ్వర్ లోని కొండల్లో మరో షెడ్యుల్ ని మొదలు పెట్టింది. ఈ షెడ్యుల్ లో తారక్, చరణ్ మధ్య కీలకమైన సన్నివేశాలను తెరకేక్కిస్తున్నాడు జక్కన్న. దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. పక్కాగా కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నారు మేకర్స్.

బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories