RRR for Oscars: ప్రతిష్టాత్మక ఆస్కార్ రేస్‌లో ఆర్ఆర్ఆర్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ సీక్రెట్సేంటి?

RRR Movie be Chosen as Indias Official Entry for Oscars?
x

RRR for Oscars: ప్రతిష్టాత్మక ఆస్కార్ రేస్‌లో ఆర్ఆర్ఆర్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ సీక్రెట్సేంటి?

Highlights

RRR for Oscars: త్రిబుల్ ఆర్ ఫర్ ఆస్కార్... సోషల్ మీడియాను షేక్ చేసేస్తోన్న అంశమిదే.

RRR for Oscars: త్రిబుల్ ఆర్ ఫర్ ఆస్కార్... సోషల్ మీడియాను షేక్ చేసేస్తోన్న అంశమిదే. దర్శకధీరుడు రాజమౌళి, ఎంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ ముగ్గురు దిగ్గజాల కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సృష్టించిన ప్రభంజన అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటి చెప్పిందీ మూవీ. అలాంటి త్రిబుల్ ఆర్‌కు ఆస్కార్ గ్యారెంటీ అనే ప్రిడెక్షన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే, త్రిబుల్ ఆర్‌కు నిజంగానే అకాడెమీ అవార్డ్ గ్యారెంటీనా..? ఒకవేళ ఆస్కార్‌కు నామినేట్ అయితే మూవీ టీమ్ చేయాల్సిన వర్క్‌ఔట్స్ ఏంటి..? త్రిబుల్ ఆర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ ఏం చెబుతున్నాయి..?

ఆర్ఆర్ఆర్.. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన మూవీ. ఇప్పుడదే మూవీపై వస్తున్న ఆస్కార్ ప్రిడిక్షన్స్ అంతకుమించిన ఉత్కంఠనే రేపుతున్నాయి. పలు అంతర్జాతీయ మ్యాగజైన్ సర్వేలు త్రిబుల్ ఆర్‌కు ఆస్కార్ గ్యారెంటీ అని తేల్చేస్తున్నాయి. దీంతో మూవీ లవర్స్‌ సైతం ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్‌ను ట్రెండింగ్‌లో నిలుపుతున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు కూడా ఆస్కార్ గ్యారెంటీ అంటున్నారు. అయితే, త్రిబుల్ ఆర్ సినిమా నిజంగానే ఆస్కార్‌ వరకూ వెళుతుందా..? ఒకవేళ ఆస్కార్ అవకాశమే వస్తే ఏ కేటగిరీల్లో బరిలో నిలుస్తుంది..? ఆస్కార్ వరకూ నామినేట్ అయితే ప్రమోషన్లకోసం భారీ ఖర్చుకు మూవీ టీమ్ సిద్ధపడుతుందా..? ఇలా ఒక్కటీ రెండు కాదు లెక్కకుమించిన ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.

నిజానికి.. త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కార్ వరకూ వెళ్లడం కాదు.. అకాడెమీ అవార్డ్ సాధించేందుకు అన్ని విధాలా అర్హత ఉన్న సినిమా. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడిగా రామ్ చరణ్‌ ఈ ఇద్దరి నటనతో పాటు రాజమౌళి టేకింగ్ కూడా ఖచ్చితంగా త్రిబుల్ ఆర్‌ను ఆస్కార్ బరిలో నిలపడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని ఇంటర్‌నేషనల్ మ్యాగజైన్ సర్వేలు సైతం ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నాయి. ఆస్కార్ 2022-23 బరిలో నామినేషన్‌కి అర్హత ఉన్న సినిమాల గురించి, ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న నటీనటుల గురించి ఇతర విభాగాల ప్రతిభావంతుల గురించి ఇప్పటికే జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే అప్‌డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా నటించిన తారక్ ఎమోషనల్ పెర్ఫామెన్స్‌కి అకాడెమీ అవార్డ్ వచ్చే ఛాన్స్ ఉందన్నదే ఆ అప్‌డేట్. కట్‌చేస్తే ఆ తర్వాతి వీక్ ప్రిడిక్షన్స్‌ చరణ్‌ కూడా ఆస్కార్‌ రేసులో ఉన్నట్టు అంచనా వేశాయి. ఇంకేముంది ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్‌, ఎన్టీఆర్, చరణ్‌ ఫర్ ఆస్కార్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.

నిజానికి.. త్రిబుల్ ఆర్‌కు ఆస్కార్‌ ప్రిడిక్షన్స్ కొత్తేం కాదు. ఇప్పటికే ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి ఆస్కార్ గ్యారెంటీ అని కామెంట్స్ చేశారు. ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయితే ఉత్తమ చిత్రంగా అవార్డు గెలిచే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత మరో టాప్ సైట్ ఐఎండీబి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఉండొచ్చని అంచనా వేసింది. రీసెంట్‌గా ఈ వెబ్ సైట్ ఆస్కార్ 2023, 95వ అకాడమీ అవార్డ్స్ కి సంబంధించి ప్రెడిక్షన్ లిస్ట్‌ను వదిలింది. ఇందులో ఐదు హాలీవుడ్ సినిమాలతో పాటు ఇండియన్ ఫిల్మ్‌ త్రిబుల్ ఆర్ కూడా ఉంది. బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ సహా బెస్ట్ స్క్రీన్‌ ప్లే, బెస్ట్ సాంగ్ కేటగిరీల్లో నిలుస్తుందని ప్రిడిక్షన్స్‌ వస్తున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగానూ భారత్ నుంచి ఆస్కార్‌కు సరైన సినిమాలను పంపించరనే విమర్శలున్నాయి. డానీ బోయెల్ స్లమ్‌ డాగ్ మిలియనీర్‌కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు రాజమౌళి త్రిబుల్ ఆర్‌కు ఎందుకు రాకూడదనే ప్రశ్నలే లేకపోలేదు.

హాలీవుడ్ రేంజ్‌లో త్రిబుల్ ఆర్‌పై ఆస్కార్ అంచనాలుండడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల యాక్టింగ్, రాజమౌళి టేకింగ్ లాంటి అంశాలే. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇండియన్ ఆడియన్స్‌‌ను మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం తారక్ నటన మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్, ఇంటర్వెల్ సీన్ అద్భుతం. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఇదే సమయంలో మన్యం వీరుడిగా చరణ్ సైతం ఇరగదీశారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్‌లో అల్లూరిగా అదరగొట్టేశారు. ఎన్టీఆర్‌తో పోరాట సన్నివేశాల్లో చరణ్‌ చూపిన భావోద్వేగాలకు ఫుల్ మార్క్స్‌ పడ్డాయి. ఇలా ఈ ఇద్దరి నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనేది హాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, త్రిబుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచినా భారీ ఖర్చుతో కూడుకున్న ప్రమోషన్లు చేస్తుందా అన్నదే అసలు ప్రశ్నంతా.

నిజానికి.. ఏ సినిమాకయినా ఆస్కార్ దక్కాలంటే అదంత ఈజీ కాదు. ఆస్కార్ రేస్‌లో నిలిచిన తర్వాత భారీగా ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్‌ కూడా ఆస్కార్‌ బరిలో నిలిస్తే తక్కువలో తక్కువ 5 మిలియన్ డాలర్లు అయినా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఆస్కార్‌లు అందుకున్న పలు చిత్రాలు ప్రమోషన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినట్టు మూవీ అనలిస్టులు చెబుతున్నారు. 2020 సంవత్సరానికి ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న పారాసైట్ మేకర్స్ ఆస్కార్ ప్రచారం కోసం 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 5 మిలియన్లు అంటే దాదాపు మన కరెన్సీలో 40కోట్లు పైమాటే. దీంతో అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసి రాజమౌళి టీమ్ త్రిబుల్ ఆర్‌కు ప్రచారం చేస్తుందా అన్నదే ఇప్పుడు అందరి సందేహం. అయితే ఆస్కార్ లాంటి వేదికపై త్రిబుల్ ఆర్ మెరుపులు మెరిపిస్తే అది తెలుగు జాతికి గర్వకారణం అవుతుంది. సో దానికోసం ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుందనే అందరూ భావిస్తున్నారు.

మరోవైపు త్రిబుల్ ఆర్ సాధించిన విజయం అసాధారణమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అమెరికన్లు అయితే త్రిబుల్ ఆర్‌పై కురిపించిన ప్రశంసలు ఆస్కార్‌ను మించే ఉంటాయి. అక్కడి ఆడియన్స్‌తో పాటు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, ఆర్టిస్టులు సైతం యూనిట్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. వీటి ప్రభావం ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్‌లో కూడా ఖచ్చితంగా చూపించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆస్కార్ బరిలో నిలిచినా ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు చేయాల్నిస అవసరం ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో ఆస్కార్ ప్రిడిక్షన్స్‌పై రాజమౌళి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐఎఫ్‌సీ సెంటర్‌లో త్రిబుల్ ఆర్ ప్రిమియర్ వేసిన సందర్భంగా ఆస్కార్ తన పనిపై ఎలాంటి ప్రభావం చూపదని క్లారిటీ ఇచ్చారు. తాను డైరెక్ట్ చేసిన సినిమాకు ఆస్కార్ వస్తే సంతోషమే అనీ, కానీ, దాని వల్ల తాను తీయబోయే తర్వాతి సినిమాను తెరకెక్కించే విధానంలో ఎలాంటి మార్పూ ఉండదన్నారు.

ఆస్కార్‌పై రాజమౌళి రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్ ట్రెండింగ్‌కు కారణం లేకపోలేదు. త్వరలోనే భారత్ తరఫున ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యే సినిమాను అఫిషియల్‌గా భారత ప్రభుత్వం అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకే సినిమాపై అంచనాలు మరింత పెంచేలా నెటిజన్లు త్రిబుల్ ఆర్‌ను ట్రెడింగ్‌లో ఉంచుతున్నారు. దీనికితోడు రీసెంట్‌గా కేంద్రహోమంత్రి అమిత్ షా ఎన్టీఆర్‌తో భేటీ సందర్భంలోను ఈ అంశం చర్చకొచ్చిందనే వార్త ఉత్కంఠ రేపుతోంది. ఆ సమయంలో త్రిబుల్‌ ఆర్‌లో ఎన్టీఆర్ నటనపై షా ప్రశంసల జల్లు కురిపించారు కూడా. దీంతో ఇండియా నుంచి త్రిబుల్ ఆర్ ఆస్కార్‌ రేసులో నిలవడం ఖాయం. కాకపోతే అకాడెమీ రేసులో ఎలా నిలుస్తుందన్న దానిపై తాజా ప్రిడిక్షన్స్ ఏ స్థాయిలో నిజమవుతాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories