Genelia: ఇక అంతా అయిపోయిందంటూ రితేశ్‌ బ్రేకప్ మెసేజ్‌..

riteish deshmukh sent break up message to genelia
x

Genelia: ఇక అంతా అయిపోయిందంటూ రితేశ్‌ బ్రేకప్ మెసేజ్‌

Highlights

Riteish Deshmukh: ‘బొమ్మరిల్లు’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన జెనీలియా.. అనంతరం పలు సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది.

Riteish Deshmukh: ‘బొమ్మరిల్లు’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన జెనీలియా.. అనంతరం పలు సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh)తో లవ్ మ్యారేజ్ చేసుకుని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరు ముంబైలో నివాసం ఉంటున్నారు. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో పలు వీడియోలు, రీల్స్ చేస్తూ అలరిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ.. తన భర్త రితేశ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. మా ఆయన చాలా సింపుల్‌‌గా ఉంటాడని, ఎంతో మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. నేను తీసుకున్న పలు మంచి నిర్ణయాల్లో రితేష్‌ను పెండ్లి చేసుకోవడమేనని తెలిపింది. అయితే, తనతో డేటింగ్‌ చేసే సమయంలో కొన్నిసార్లు షాక్‌కు గురిచేస్తుంటాడని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది. మేం డేటింగ్‌లో ఉన్నప్పుడు ఒక షాకింగ్ విషయం చోటు చేసుకుంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. రితేశ్‌ చాలా ఆలస్యంగా నిద్రపోతుంటాడు. నాకేమో చాలా త్వరగా నిద్ర వస్తుంది. ఓరోజు షడన్‌గా అర్ధరాత్రి 1 గంట సమయంలో రితేశ్ నాకొక మెసేజ్ పంపారు. అంతా అయిపోయిందంటూ ఓ బ్రేకప్‌ మెసేజ్ పెట్టారు. అది చూసి నేను షాకయ్యాను. ఎంతో బాధగా అనిపించింది. అసలు విషయం ఏంటో తెలియక పిచ్చి లేచింది. అయితే, రితేష్ నిద్రలేచిన తర్వాత మెసేజ్ గురించి మర్చిపోయారు. నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటూ ఆరా తీశారు. నాకు బాగా కోపం వచ్చింది. అసలు విషయం అడిగేశాను. కేవలం జోక్‌గా ఆ మెసేజ్ చేసినట్లు తాపీగా ఆయన చెప్పారంటూ గుర్తు చేసుకుంది.

కాగా, వీరిద్దరి మధ్య పరిచయం 2003లో జరిగింది. ఇద్దరు కలిసి నటించిన ‘తుజే మేరీ కసమ్‌’ సినిమాతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. దాదాపు 10 ఏళ్లు డేటింగ్‌ చేశారు. అనంతరం 2012లో మ్యారేజ్ చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories