RGV: వర్మ...మరణం..సమ్ థింగ్ రాంగ్

RGV Interesting Comments on His Death
x

DIRECTOR RGV:(File Image)

Highlights

RGV: లేటెస్టుగా చావు గురించి ట్వీట్ పెట్టి మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు ఆర్టీవీ.

RGV: వోడ్కా విత్ వర్మ అనే పుస్తకం ఎందుకు రాశారో గాని... వర్మ ఏ ట్వీట్ పెట్టినా ఆ టైమ్ లోనే పెట్టాడనిపిస్తోంది. ఎవరూ ఊహించలేని విధంగా.. ఎవరికీ అంతుపట్టని విధంగా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ట్వీట్ చేయడం వర్మ స్పెషాలిటీ. అందుకే పర్ వర్టెడ్ అని తిట్టుకుంటూనే వర్మ ట్వీట్స్ తెగ ఫాలో అవుతుంటారు జనం. లేటెస్టుగా చావు గురించి ట్వీట్ పెట్టి మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అదే వర్మ స్టయిల్ అంటే అని కొందరంటుంటే... మరణం గురించి ఆలోచిస్తున్నాడంటే సమ్ థింగ్ రాంగ్ అని కొందరనుకుంటున్నారు.

ఎప్పుడో అప్పుడు చావక తప్పదు.. అలాంటప్పుడు చావుపై భయం ఎందుకు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇది మణిరత్నం గీతాంజలి సినిమాలో డైలాగ్. అదే డైలాగ్ వర్మ చెబితే ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు ఈ ట్వీట్ నెటిజన్లకు కిక్ ఇస్తోంది. ఓ వైపు కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే.. వర్మ మాత్రం తన చావు ఎంత గ్రాండ్‌గా ఉండాలో చెప్పుకొచ్చాడు. అసలు ఈయన ఎలా ఆలోచిస్తాడో ఎవరూ ఊహించలేం కూడా.

ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా తన చావు గురించి చెప్పుకొచ్చాడు. పుట్టాక చనిపోవడం అనేది చాలా కామన్‌.. కాబట్టి చావు ఎప్పుడైనా వస్తుంది.. దాని గురించి భయపడుతూ బాధ పడటం వేస్ట్ అంటూ చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నాడు వర్మ. కాబట్టి ఈ చావు గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. తన వరకు వస్తే ఏదైనా అణుబాంబు పేలుతున్న సమయంలో నేను దాన్ని చూస్తూ చనిపోవాలి అంటూ తెలిపాడు వర్మ.

Show Full Article
Print Article
Next Story
More Stories