MAA Election: రామారావు టు రజనీకాంత్.... వీళ్లంతా లోకలా?...ఆర్టీవీ

RGV Comments on Non Local Issue
x

Director RGV

Highlights

MAA Election: మా ఎలక్షన్స్ చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ మారడంతో ప్రకాశ్ రాజ్ పై ఆర్టీవీ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

MAA Election: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల అంశం ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్‌పై పలువురు ఇండస్ట్రీ సభ్యులు విమర్శల వర్షం ఎక్కుపెట్టారు. ఆయన నాన్‌లోకల్‌ అని.. 'మా' ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కౌంటర్‌ వేశారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌ వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌లోకల్‌ అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ.. ఎలా లోకల్‌ అవుతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్‌బాబు లోకలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్‌ బచ్చన్ లోకలా? ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని ముద్రించి, భార్యాపిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతోమంది మహిళలకు పని కల్పిస్తున్న ఆయన నాన్ లోకలా? ప్రకాశ్‌రాజ్‌లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే.. ఇప్పుడు అదే వ్యక్తిని నాన్‌లోకల్‌ అంటున్నాం' అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories