Skill Development Case: జనసేనాని పవన్‌కు ఆర్జీవీ క్వశ్చన్స్‌.. తన ప్రశ్నలకు వన్‌ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలన్న వర్మ

RGV Asks Nine Questions to Pawan Kalyan on Chandrababu Skill Development Case
x

Skill Development Case: జనసేనాని పవన్‌కు ఆర్జీవీ క్వశ్చన్స్‌.. తన ప్రశ్నలకు వన్‌ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలన్న వర్మ

Highlights

RGV: స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జనసేనాని పవన్ మద్దతు పలకడంపై సినీ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.

RGV: స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జనసేనాని పవన్ మద్దతు పలకడంపై సినీ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా తొమ్మిది ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా..? ఒకవేళ జరిగి ఉంటే.. అంది చంద్రబాబుకు తెలియకుండా జరిగిందా..? అంటూ పలు ప్రశ్నలు వేశారు. చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తిస్తుందని చెప్పిన లాయర్లు కరప్టా అన్న ఆర్జీవీ.. అసలు స్కిల్ స్కాం గురించి పవన్‌కు ఏం అర్థం అయిందో కెమెరా వంక చూసి వివరించగలరా అంటూ ప్రశ్నించారు.

1. అసలు స్కిల్ స్కాం జరిగిందా..? లేదా..?

2. ఒకవేళ జరిగి ఉంటే అది CBNకి తెలియకుండా జరిగిందా..?

3. రూ.300 కోట్ల ప్రజాధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవకుండా..ఆఫీసర్స్ చెబుతున్నా వినకుండా రిలీజ్ చేశారా..?

4. స్కాం గురించి CBNకి తెలిసి ఉంటే యాక్షన్ తీసుకోకపోవడం సరైందేనా..?

5. FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే...సేకరించిన వివరాలను బట్టి ఎవరి పేరైనా యాడ్ చెయ్యొచ్చన్న విషయం తెలియదా?

6. చూపించిన డాక్యుమెంట్స్‌ను బట్టి..క్రైమ్ చేసినట్టు నమ్మిన జడ్జి బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?

7. సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?

8. లీడర్స్ 40 ఏళ్ల బ్యాక్‌గ్రౌండ్‌ బట్టి కాదు..చేసే పనులను బట్టి అవుతారనే విషయం మీకు తెలియదా ?

9. అసలు స్కిల్ స్కాం కేసు మీకేం అర్థమైందో..దానిలోని తప్పులేంటో..ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?

Show Full Article
Print Article
Next Story
More Stories