Shilpa Shetty: అడ్డగోలు కామెంట్లు చేయకండి.. నా పిల్లల భవిష్యత్తు పై ఆలోచించండి

Requesting as a Mother, Please Respect Our Privacy Says Shilpa Shetty
x

Shilpa Shetty: అడ్డగోలు కామెంట్లు చేయకండి.. నా పిల్లల భవిష్యత్తు పై ఆలోచించండి

Highlights

Shilpa Shetty: భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందంటున్నారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.

Shilpa Shetty: భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందంటున్నారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. పోర్నోగ్రఫీ కేసులో భర్త రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత తొలిసారి ఆమె స్పందించారు. కొన్ని రోజులుగా తనను తన కుటుంబాన్ని నిందిస్తూ సోషల్ మీడియాలో అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శిల్పా.

అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా ఇష్టాను సారం కామెంట్లు చేయద్దని తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక తల్లిగా తనను నిందించొద్దని అన్నారు. అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాతోపాటు శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. విచారణ సమయంలో కుంద్రాను చూసి శిల్పా కన్నీళ్లు పెట్టుకుని పెద్దగా ఘర్షణ పడిందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories