Pawan kalyan: పవన్​ కల్యాణ్​ గెలుపుపై రేణూ దేశాయ్‌ పోస్ట్‌..

Renu Desai post on Pawan Kalyan win
x

Pawan kalyan: పవన్​ కల్యాణ్​ గెలుపుపై రేణూ దేశాయ్‌ పోస్ట్‌..

Highlights

Pawan kalyan: ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందారు పపన్ కళ్యాణ్. ఇంకా ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన అందరూ కూడా అన్ని స్థానాల్లోనూ విజయ కేతనం ఎగిరేశారు. దీంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు జనసైనికులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ నివాసం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారందరికీ పవన్‌ భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఆ వీడియో కూడా ఎక్స్‌లో వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా’ అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పాటు పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories