నేను అలా అనలేదు..తల్లి పాత్రల పై హెచ్ఎంటీవీ తో రేణూదేశాయ్

నేను అలా అనలేదు..తల్లి పాత్రల పై హెచ్ఎంటీవీ తో రేణూదేశాయ్
x
Renu Desai (File Photo)
Highlights

నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన రేణు దేశాయ్ దర్శకురాలిగా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన రేణు దేశాయ్ దర్శకురాలిగా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రైతులపై చిత్రం తీయబోతున్నట్లు రేణు దేశాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని కూడా పరిశీలించారు. అక్కడి ప్రజలతో సమయం కాస్తా సమయం గడిపారు. మన రైతుల కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆతృతగా ఉన్నానని రేణు దేశాయ్ వెల్లడించారు. అయితే తాజాగా హెచ్ఏంటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దర్శకురాలిగా సినిమాని చేయడం తనకి ఎంతో ఇష్టమని, ఇది 16 ఏళ్ళ వయసు నుంచి ఉన్న డ్రీమ్ అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.

రేణు దేశాయ్ మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, టాలీవుడ్ అగ్రహీరోలు అయిన మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలకు తల్లిగా నటించేందుకు సిద్ధం అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన ఈ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ దీనిపైన స్పందించారు. ''నేను ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడాను. కానీ మీడియాలో వస్తున్న విధంగా కాదు. అవసరం అయితే, పాత్ర బాగుంటే మహేశ్‌బాబు, ప్రభాస్‌కు తల్లి పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాను. హీరో చిన్నతం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో తల్లిగా చేస్తానని చెప్పాను'' అని వివరించారు.

మేకప్‌తో వృద్ధురాలి గెటప్‌ వేసుకుని ఆ పాత్రలు చేయడానికి కూడా అభ్యంతరం లేదని, మేము నటులం అని రేణుదేశాయ్ పేర్కొన్నారు. అంతేకాకుండా బాహుబలి సినిమాలో అనుష్క ప్రభాస్ కి తల్లిగా నటించిన విషయాన్ని రేణు దేశాయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రేణూ దేశాయ్ తో హెచ్ఏంటీవి పూర్తి ఇంటర్వ్యూ మీరూ చూసేయండి..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories