Ray Bradbury Fahrenhiet Burning Book:'ఫారెన్‌హీట్ 451'పుస్తకం.. చదవాలంటే కాల్చాల్సిందే
Ray Bradbury Fahrenhiet Burning Book: ఏ పుస్తకం చదవాలన్న ఆ భాష మనకి అర్ధం అయితే సరిపోతుంది. దానిని చదువుతాం..మన మనసుకు హత్తుకునేలా పదాలు ఉంటే మళ్లీ...
Ray Bradbury Fahrenhiet Burning Book: ఏ పుస్తకం చదవాలన్న ఆ భాష మనకి అర్ధం అయితే సరిపోతుంది. దానిని చదువుతాం..మన మనసుకు హత్తుకునేలా పదాలు ఉంటే మళ్లీ మళ్లీ చదువుతాం. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని మన అలమరలో పెట్టుకుంటాం. కానీ ఓ బుక్ అలా కాదు.. దానిని చదవాలంటే కాల్చాలి.. పుస్తకాన్ని కాలిస్తే ఏమవుతుంది? బూడిద మిగులుతుంది. అంటారా కాదు.. ఇక్కడ చెప్పుకోబోయే పుస్తకంలోని పేజీలను చదవాలంటే కచ్చితంగా వాటిని కాల్చాలి. ఎందుకంటే నిప్పు తగలనిదే ఆ పుస్తకంలోని అక్షరాలు కనిపించవు.
ఆ పుస్తకమే ప్రముఖ అమెరికన్ రచయిత రే బ్రాడ్‌బురీ రాసిన '' ఫారెన్‌హీట్ 451''. 'ఫారెన్‌హీట్ 451' లోని పేజీలు మొత్తం నల్లటి వర్ణంలో ఉంటాయి. వాటిని చదవాలంటే కచ్చితంగా నిప్పును తాకించి తీరాలి. కాగితాలపై నిప్పు తగలగానే ఆ పుస్తకంపై ఉన్న నల్లటి రంగు మాయమై అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. సైన్స్ గర్ల్ ( science girl) అనే ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ''ఈ బుక్ చాలా అద్భుతం మంత్ర, తంత్రాల పుస్తకంలా ఉంది... ఇది ఓ మాయా పుస్తకం దీనిని నిప్పు అంటిస్తెనే చదవగలం'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పుస్తకం గురించి ఇప్పుడు అందరూ నేట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ బుక్ ను ఒక్క సారైనా చూడాలని ఆసక్తికనబరుస్తున్నారు.
"... Do not think you are going to conceal thoughts by concealing evidence that they ever existed"
— Science girl (@gunsnrosesgirl3) June 24, 2020
Dwight D. Eisenhower
In Ray Bradbury's Fahrenheit 451, books are banned–not only banned, but burned. Here is a heat sensitive version that can only be read when 'burned'. pic.twitter.com/phTiN32LGf
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire