Rashmika Mandanna: అదంతా టైంపాస్ అంటున్న రష్మిక

Rashmika Responds To Marriage With Vijay Deverakonda
x

Rashmika Mandanna: అదంతా టైంపాస్ అంటున్న రష్మిక

Highlights

Rashmika Mandanna: అదంతా టైంపాస్ అంటున్న రష్మిక

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలతో బ్లాక్ బస్టర్ లను అందుకున్న ఈ భామ గతంలో కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి నీ ప్రేమించింది. వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారి ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్ళలేదు. ఆ తరువాత "గీత గోవిందం" సినిమా అప్పటి నుంచి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో ప్రేమ లో ఉంది అంటూ పుకార్లు మొదలయ్యాయి.

తాజాగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్న ఈ వార్తల పై రియాక్ట్ అయింది. అవన్నీ కేవలం టైం పాస్ అని కొట్టిపారేసింది. "నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది" అంటూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది రష్మిక. ఇక సినిమా పరంగా చూస్తే రష్మిక శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మార్చి 4న విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories